Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 31 వచనము 17

ద్వితియోపదేశాకాండము 29:20 అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు; అట్టివాడు మీలోనుండినయెడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యునిమీద పొగరాజును; ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండ తుడిచివేయును.

ద్వితియోపదేశాకాండము 32:21 వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టించిరి తమ వ్యర్థ ప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకాని వారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.

ద్వితియోపదేశాకాండము 32:22 నా కోపాగ్ని రగులుకొనును పాతాళాగాధమువరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవలబెట్టును.

న్యాయాధిపతులు 2:14 కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; ఆయన దోచు కొనువారిచేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి శత్రువులచేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల యెదుట నిలువలేకపోయిరి.

న్యాయాధిపతులు 2:15 యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి యిబ్బంది కలిగెను.

కీర్తనలు 2:12 ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.

కీర్తనలు 90:11 నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును? నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియును?

1దినవృత్తాంతములు 28:9 సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము,ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును.

2దినవృత్తాంతములు 15:2 ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును,

యిర్మియా 23:33 మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్నడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుము మీరే ఆయనకు భారము; మిమ్మును ఎత్తి పారవేతును; ఇదే యెహోవా వాక్కు. మరియు

యిర్మియా 23:39 కాగా నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను, మీకును మీ పితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధినుండి పారవేయుచున్నాను.

హోషేయ 9:12 వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరును లేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును.

ద్వితియోపదేశాకాండము 32:20 ఆయన ఇట్లనుకొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదను వారు మూర్ఖచిత్తము గలవారు విశ్వాసములేని పిల్లలు.

యోబు 13:24 నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి? నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు?

కీర్తనలు 27:9 నీ ముఖమును నాకు దాచకుము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము నన్ను విడువకుము

కీర్తనలు 30:7 యెహోవా, దయకలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత జెందితిని

కీర్తనలు 89:46 యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును?

కీర్తనలు 104:29 నీవు ముఖము మరుగుచేసికొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును.

యెషయా 8:17 యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుచేసికొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచుచున్నాను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను.

యెషయా 64:7 నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేకపోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొను వాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు.

యెహెజ్కేలు 39:23 మరియు ఇశ్రాయేలీయులు తమ దోషమునుబట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాస ఘాతకులైనందున నేను వారికి పరాజ్ముఖుడనై వారు ఖడ్గముచేత కూలునట్లుగా వారిని బాధించువారికి అప్పగించితిననియు అన్యజనులు తెలిసికొందురు.

యెహెజ్కేలు 39:24 వారి యపవిత్రతనుబట్టియు అతిక్రమ క్రియలనుబట్టియు నేను వారికి పరాజ్ముఖుడనై వారికి ప్రతికారము చేసితిని.

యెహెజ్కేలు 39:29 అప్పుడు ఇశ్రాయేలీయులమీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాజ్ముఖుడనై యుండను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

నెహెమ్యా 9:32 చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టి మహా పరాక్రమశాలివియు భయంకరుడవునగు మా దేవా, అష్షూరు రాజుల దినములు మొదలుకొని యీ దినములవరకు మా మీదికిని మా రాజుల మీదికిని ప్రధానుల మీదికిని మా పితరుల మీదికిని నీ జనులందరి మీదికిని వచ్చిన శ్రమయంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండును గాక.

యోబు 34:11 నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫలమిచ్చును.

ద్వితియోపదేశాకాండము 29:24 యెహోవా దేనిబట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు.

ద్వితియోపదేశాకాండము 29:25 మరియు వారు వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి

ద్వితియోపదేశాకాండము 29:26 తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్కరించిరి

ద్వితియోపదేశాకాండము 29:27 గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను.

సంఖ్యాకాండము 14:42 అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడుగనుక మీ శత్రువులయెదుట హతము చేయబడుదురు; మీరు సాగిపోకుడి.

న్యాయాధిపతులు 6:13 గిద్యోనుచిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవిం చెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయులచేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను.

యెషయా 63:17 యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్యగోత్రముల నిమిత్తము తిరిగిరమ్ము.

ఆదికాండము 19:19 ఇదిగో నీ కటాక్షము నీ దాసునిమీద వచ్చినది; నా ప్రాణము రక్షించుటవలన నీవు నాయెడల కనుపరచిన నీ కృపను ఘనపరచితివి; నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను; ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో

ఆదికాండము 44:29 మీరు నా యెదుటనుండి ఇతని తీసికొనిపోయిన తరువాత ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలుగల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను.

నిర్గమకాండము 17:7 అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టియు అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను.

సంఖ్యాకాండము 14:34 మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు.

ద్వితియోపదేశాకాండము 4:30 ఈ సంగతులన్నియు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవావైపు తిరిగి ఆయన మాట వినినయెడల

ద్వితియోపదేశాకాండము 28:59 యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునై యుండును.

ద్వితియోపదేశాకాండము 31:18 వారు అన్యదేవతలతట్టు తిరిగి చేసిన కీడంతటినిబట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును.

ద్వితియోపదేశాకాండము 31:20 నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు, పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత, వారు తిని త్రాగి తృప్తిపొంది క్రొవ్వినవారై అన్యదేవతలతట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు.

యెహోషువ 3:10 వారితో యిట్లనెనుసర్వలోక నాధుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక

న్యాయాధిపతులు 2:12 తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతరదేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహో వాకు కోపము పుట్టించిరి.

1సమూయేలు 12:22 యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగియున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.

2రాజులు 17:7 ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములోనుండియు, ఐగుప్తు రాజైన ఫరోయొక్క బలముక్రిందనుండియు, తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపముచేసి యితర దేవతలయందు భయభక్తులు నిలిపి

2రాజులు 18:12 అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి తీసికొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను పట్టణములలోను మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను.

2రాజులు 21:14 మరియు నా స్వాస్థ్యములో శేషించినవారిని నేను త్రోసివేసి వారి శత్రువులచేతికి వారిని అప్పగించెదను.

2రాజులు 22:13 మీరు పోయి దొరికిన యీ గ్రంథపు మాటలనుగూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవాయొద్ద విచారణ చేయుడి; మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చేయక యీ గ్రంథపు మాటలను విననివారైరి గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుచున్నది.

2దినవృత్తాంతములు 28:6 రెమల్యా కుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలులైన లక్ష ఇరువది వేలమందిని ఒక్కనాడు హతముచేసెను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టిగతి పట్టెను.

ఎజ్రా 5:12 మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరను బబులోను రాజుచేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనముచేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను.

కీర్తనలు 13:1 యెహోవా, ఎన్నాళ్లవరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై యుందువు?

కీర్తనలు 69:24 వారిమీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక

యెషయా 2:6 యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు వారు ఫిలిష్తీయులవలె మంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించియున్నావు.

యెషయా 5:25 దానినిబట్టి యెహోవా కోపము ఆయన ప్రజలమీద మండుచున్నది. ఆయన వారిమీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణకుచున్నవి. వీధులమధ్యను వారి కళేబరములు పెంటవలె పడియున్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

యెషయా 9:12 తూర్పున సిరియాయు పడమట ఫిలిష్తీయులును నోరుతెరచి ఇశ్రాయేలును మింగివేయవలెనని యున్నారు ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు.ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

యెషయా 54:11 ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును

యెషయా 59:2 మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.

యిర్మియా 3:25 సిగ్గునొందినవారమై సాగిలపడుదము రండి, మనము కనబడకుండ అవమానము మనలను మరుగుచేయును గాక; మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులును మన బాల్యమునుండి నేటివరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసినవారము.

యిర్మియా 9:13 అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారు నా మాట వినకయు దాని ననుసరింపకయు, నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి

యిర్మియా 11:8 అయినను వారు తమ దుష్టహృదయములో పుట్టు మూర్ఖతచొప్పున నడుచుచు వినకపోయిరి; చెవియొగ్గినవారు కాకపోయిరి, వారు అనుసరింపవలెనని నేను వారికాజ్ఞాపించిన యీ నిబంధన మాటలన్నిటిననుసరించి నడువలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటిని వారిమీదికి రప్పించుచున్నాను.

యిర్మియా 16:5 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనియ్యకయు వారియెడల నా కృపావాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనముచేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారినిగూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరినిని ఓదార్చుటకు వెళ్లకుము; ఇదే యెహోవా వాక్కు

యిర్మియా 18:17 తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువులయెదుట నిలువకుండ వారిని నేను చెదరగొట్టెదను; వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును.

యిర్మియా 28:8 నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు, అనేకదేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచు వచ్చిరి.

యిర్మియా 32:24 ముట్టడిదిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి, ఖడ్గము క్షామము తెగులు వచ్చుటవలన దానిమీద యుద్ధముచేయుచుండు కల్దీయులచేతికి ఈ పట్టణము అప్పగింపబడును; నీవు సెలవిచ్చినది సంభవించెను, నీవే దాని చూచుచున్నావు గదా?

యిర్మియా 33:5 కల్దీయులతో యుద్ధము చేసి, వారి చెడుతనమునుబట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపముచేత హతులై, తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తి కలిగించుటకై వారు వచ్చుచుండగా

విలాపవాక్యములు 2:17 యెహోవా తాను యోచించిన కార్యము ముగించియున్నాడు పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చియున్నాడు శేషములేకుండ నిన్ను పాడుచేసియున్నాడు నిన్నుబట్టి శత్రువులు సంతోషించునట్లు చేసియున్నాడు నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు.

దానియేలు 9:11 ఇశ్రాయేలీయులందరు నీ ధర్మశాస్త్రము నతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితివిు గనుక నేను శపించెదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసియున్నట్లు ఆ శాపమును మామీద కుమ్మరించితివి.

మీకా 3:4 వారు దుర్మార్గత ననుసరించి నడుచుకొనియున్నారు గనుక వారు యెహోవాకు మొఱ్ఱ పెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండ తన్ను మరుగుచేసికొనును.

జెఫన్యా 1:18 యెహోవా ఉగ్రతదినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వనాశనము చేయబోవుచున్నాడు.