Logo

యెహెజ్కేలు అధ్యాయము 1 వచనము 6

ప్రకటన 4:6 మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను.

ప్రకటన 6:6 మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడుచేయవద్దనియు, ఆ నాలుగు జీవులమధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను.

నిర్గమకాండము 36:8 ఆ పని చేసినవారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును పది తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేసెను.

కీర్తనలు 18:10 కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరివచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.

యెహెజ్కేలు 10:15 ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నదిదగ్గర నాకు కనబడిన జంతువు ఇదే.

జెకర్యా 1:10 అప్పుడు గొంజిచెట్లలో నిలువబడియున్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుఱ్ఱములని చెప్పెను.

జెకర్యా 6:5 అతడు నాతో ఇట్లనెను ఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్లు ఆకాశపు చతుర్వాయువులు.