Logo

యెహెజ్కేలు అధ్యాయము 1 వచనము 15

కీర్తనలు 147:15 భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును.

దానియేలు 9:21 నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా, మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను.

జెకర్యా 2:3 అంతట నాతో మాటలాడుచున్న దూత బయలుదేరగా మరియొక దూత యతనిని ఎదుర్కొనవచ్చెను.

జెకర్యా 2:4 రెండవ దూత పరుగెత్తిపోయి యెరూషలేములో మనుష్యులును పశువులును విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యౌవనునికి తెలియజేయుమని మొదటిదూతకు ఆజ్ఞ ఇచ్చెను.

జెకర్యా 4:10 కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించినవాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క యేడు నేత్రములు జెరుబ్బాబెలుచేతిలో గుండునూలుండుట చూచి సంతోషించును.

మత్తయి 24:27 మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును.

మత్తయి 24:31 మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.

మార్కు 13:27 అప్పుడాయన తన దూతలను పంపి, భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కులనుండి తాను ఏర్పరచుకొనినవారిని పోగుచేయించును.

యెహెజ్కేలు 10:15 ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నదిదగ్గర నాకు కనబడిన జంతువు ఇదే.

దానియేలు 10:6 అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను

హెబ్రీయులకు 1:7 తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు

ప్రకటన 14:6 అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను