Logo

యెహెజ్కేలు అధ్యాయము 44 వచనము 2

యెహెజ్కేలు 40:6 అతడు తూర్పుతట్టుననున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానములమీది కెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను.

యెహెజ్కేలు 40:17 అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట గదులును చఎ్టాయు కనబడెను. చఎ్టామీద ముప్పది చిన్నగదులు ఏర్పడియుండెను.

యెహెజ్కేలు 42:14 యాజకులు లోపల ప్రవేశించునప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణములోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను; అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరుబట్టలు ధరించుకొనవలెను.

2దినవృత్తాంతములు 4:9 అతడు యాజకుల ఆవరణమును పెద్ద ఆవరణమును దీనికి వాకిండ్లను చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను.

2దినవృత్తాంతములు 20:5 యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల యెదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనులమధ్యను నిలువబడి

2దినవృత్తాంతములు 33:5 మరియు యెహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశనక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను.

అపోస్తలులకార్యములు 21:28 ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ద స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి

అపోస్తలులకార్యములు 21:29 ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడ పట్టణములో అంతకుముందు వారు చూచి యున్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసికొని వచ్చెనని ఊహించిరి.

అపోస్తలులకార్యములు 21:30 పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తికొని వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయములోనుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి; వెంటనే తలుపులు మూయబడెను.

యెహెజ్కేలు 43:1 తరువాత అతడు తూర్పుతట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొనిరాగా

యెహెజ్కేలు 43:4 తూర్పుతట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజోమహిమ మందిరములోనికి ప్రవేశించెను.

యెహెజ్కేలు 46:1 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తూర్పుతట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము, పనిచేయు ఆరు దినములు మూయబడియుండి, విశ్రాంతిదినమునను అమావాస్య దినమునను తీయబడియుండవలెను.

యెహెజ్కేలు 46:8 అధిపతి ప్రవేశించునప్పుడు గుమ్మపు మంటపమార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను.