Logo

యెహెజ్కేలు అధ్యాయము 44 వచనము 17

ప్రకటన 1:6 మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.

యెహెజ్కేలు 41:22 బలిపీఠము కఱ్ఱతో చేయబడెను, దాని యెత్తు మూడు మూరలు, నిడివి రెండు మూరలు, దాని పీఠమును మూలలును ప్రక్కలును మ్రానితో చేయబడినవి; ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను.

మలాకీ 1:7 నా బలిపీఠముమీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమిచేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనపు బల్లను నీచపరచినందుచేతనే గదా

మలాకీ 1:12 అయితే­యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు, దానిమీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు

సంఖ్యాకాండము 18:7 కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెర లోపలిదాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చియున్నాను; అన్యుడు సమీపించినయెడల మరణశిక్ష నొందును.

సంఖ్యాకాండము 18:8 మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించువాటన్నిటిలో నా ప్రతిష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చియున్నాను; అభిషేకమునుబట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను.

ద్వితియోపదేశాకాండము 33:8 లేవినిగూర్చి యిట్లనెను నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి.

ద్వితియోపదేశాకాండము 33:9 అతడు నేను వానినెరుగనని తన తండ్రినిగూర్చియు తన తల్లినిగూర్చియు అనెను తన సహోదరులను లక్ష్యపెట్టలేదు తన కుమారులను కుమారులని యెంచలేదు వారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి.

ద్వితియోపదేశాకాండము 33:10 వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పించుదురు

సంఖ్యాకాండము 16:5 తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చుకొనును.

1సమూయేలు 2:35 తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజకత్వము జరిగించును.

1రాజులు 7:48 మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటిని చేయించెను, అనగా బంగారపు బలిపీఠమును సముఖపు రొట్టెలనుంచు బంగారపు బల్లలను,

2దినవృత్తాంతములు 4:8 పది బల్లలను చేయించి దేవాలయమందు కుడి తట్టున అయిదును ఎడమ తట్టున అయిదును ఉంచెను; నూరు బంగారపు తొట్లను చేయించెను.

యెహెజ్కేలు 23:41 ఘనమైన మంచముమీద కూర్చుండి బల్లను సిద్ధపరచి దానిమీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి.

యెహెజ్కేలు 40:39 మరియు గుమ్మపు మంటపములో ఇరుప్రక్కల రెండేసి బల్లలుంచబడెను; వీటిమీద దహనబలి పశువులును పాప పరిహారార్థ బలిపశువులును అపరాధపరిహారార్థ బలిపశువులును వధింపబడును.

యెహెజ్కేలు 44:8 నేను మీకప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక, వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి.

యెహెజ్కేలు 48:11 ఇది సాదోకు సంతతివారై నాకు ప్రతిష్టింపబడి నేను వారి కప్పగించిన దానిని కాపాడు యాజకులదగును; ఏలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లె వారు నన్ను విడిచిపోలేదు.

జెకర్యా 3:7 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా మార్గములలొ నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనినయెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును.

మలాకీ 3:3 వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని యుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.