Logo

కీర్తనలు అధ్యాయము 10 వచనము 7

కీర్తనలు 59:12 వారి పెదవుల మాటలనుబట్టియు వారి నోటి పాపమునుబట్టియు వారు పలుకు శాపములనుబట్టియు అబద్ధములనుబట్టియు వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక.

కీర్తనలు 62:4 అతని ఔన్నత్యమునుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. (సెలా.)

రోమీయులకు 3:14 వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి.

కీర్తనలు 5:9 వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు.

కీర్తనలు 7:14 పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించినవాడై అబద్దమును కనియున్నాడు.

కీర్తనలు 36:3 వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలుచేయను వాడు మానివేసియున్నాడు.

కీర్తనలు 52:4 కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము.

కీర్తనలు 55:21 వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే.

కీర్తనలు 58:3 తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.

కీర్తనలు 64:3 ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు.

యెషయా 59:4 నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు.

యిర్మియా 9:3 విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు; దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడువెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 9:6 నీ నివాసస్థలము కాపట్యము మధ్యనేయున్నది, వారు కపటులై నన్ను తెలిసికొననొల్లకున్నారు; ఇదే యెహోవా వాక్కు.

రోమీయులకు 3:13 వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది

యోబు 20:12 చెడుతనము వారి నోటికి తియ్యగా నుండెను వారు నాలుకక్రింద దాని దాచిపెట్టిరి.

కీర్తనలు 7:14 పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించినవాడై అబద్దమును కనియున్నాడు.

కీర్తనలు 140:9 నన్ను చుట్టుకొనువారు తలయెత్తినయెడల వారి పెదవుల చేటు వారిని ముంచును గాక

యోబు 15:35 వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురు వారి కడుపున కపటము పుట్టును.

మత్తయి 12:34 సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.

యాకోబు 3:6 నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.

యాకోబు 3:7 మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతిచేత సాధు కాజాలును, సాధు ఆయెను గాని

యాకోబు 3:8 యే నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.

కీర్తనలు 12:2 అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.

కీర్తనలు 41:6 ఒకడు నన్ను చూడవచ్చినయెడల వాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును పోగుచేసికొనుచున్నది. వాడు బయలువెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు.

కీర్తనలు 144:8 వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడిచేయి అబద్ధముతో కూడియున్నది.

కీర్తనలు 144:11 నన్ను తప్పింపుము అన్యులచేతిలోనుండి నన్ను విడిపింపుము వారి నోరు వట్టిమాటలాడుచున్నది వారి కుడిచేయి అబద్ధముతో కూడియున్నది.

సామెతలు 21:6 అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు.

సామెతలు 30:8 వ్యర్థమైనవాటిని ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.

సంఖ్యాకాండము 35:20 వాని కనుగొనినప్పుడు వాని చంపవలెను. ఒకడు చచ్చునట్లు వాని పగపట్టి పొడిచినను, లేక పొంచియుండి వానిమీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరమువలన చేతితో వాని కొట్టినను, కొట్టినవాడు నరహంతకుడు, నిశ్చయముగా వాని చంపవలెను.

కీర్తనలు 28:3 భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడుదురు

కీర్తనలు 50:19 కీడు చేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది.

కీర్తనలు 52:1 శూరుడా, చేసిన కీడునుబట్టి నీ వెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును.

సామెతలు 6:12 కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడును దుష్టుడునైయున్నాడు

సామెతలు 24:2 వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును.

యెషయా 32:7 మోసకారి సాధనములును చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు.

మత్తయి 15:11 నోటపడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోటనుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను.

యాకోబు 3:9 దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.