Logo

కీర్తనలు అధ్యాయము 10 వచనము 14

కీర్తనలు 35:22 యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌనముగా నుండకుము నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము.

సామెతలు 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలముమీదనుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.

యిర్మియా 16:17 ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి యుంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగైయుండదు.

యిర్మియా 23:24 యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.

హెబ్రీయులకు 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసి యున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.

హబక్కూకు 1:13 నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?

న్యాయాధిపతులు 1:7 అప్పుడు అదోనీ బెజెకుతమ కాళ్లుచేతుల బొట్టనవ్రేళ్లు కోయబడిన డెబ్బదిమంది రాజులు నా భోజనపు బల్లక్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెననెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొనిరాగా అతడు అక్కడ చనిపోయెను.

2రాజులు 9:26 అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతికారము చేయుదును; ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాటచొప్పున అతని ఎత్తి యీ భూభాగమందు పడవేయుము అనెను.

2దినవృత్తాంతములు 6:23 నీవు ఆకాశమందు విని, నీ దాసులకు న్యాయముతీర్చి, హాని చేసినవాని తలమీదికి శిక్ష రప్పించి, నీతిపరుని నీతిచొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము.

యిర్మియా 51:56 బబులోనుమీదికి పాడుచేయువాడు వచ్చుచున్నాడు దాని బలాఢ్యులు పట్టబడియున్నారు వారి విండ్లు విరిగిపోయినవి యెహోవా ప్రతికారము చేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును.

యోవేలు 3:4 తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిష్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పనియేమి? నేను చేసినదానికి మీరు నాకు ప్రతికారము చేయుదురా? మీరు నాకేమైన చేయుదురా?

కీర్తనలు 55:22 నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.

2తిమోతి 1:12 ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.

1పేతురు 4:19 కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్‌ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.

1పేతురు 5:7 ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.

యెషయా 10:3 దర్శనదినమున దూరమునుండి వచ్చు ప్రళయదినమున మీరేమి చేయుదురు? సహాయమునొందుటకు ఎవరియొద్దకు పారిపోవుదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు?

యిర్మియా 49:11 అనాధులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను, నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను.

కీర్తనలు 68:5 తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేనివారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు

కీర్తనలు 146:9 యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేనివారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా చేయును.

ద్వితియోపదేశాకాండము 10:18 ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశియందు దయయుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.

హోషేయ 14:3 అష్షూరీయులచేత రక్షణ నొందగోరము, మేమికను గుఱ్ఱములను ఎక్కము మీరే మాకు దేవుడని మేమికమీదట మాచేతిపనితో చెప్పము; తండ్రిలేనివారియెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా.

ఆదికాండము 4:9 యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీనునడుగగా అతడు నేనెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను.

నిర్గమకాండము 21:26 ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టినయెడల ఆ కంటి హానినిబట్టి వారిని స్వతంత్రునిగా పోనియ్యవలెను.

యెహోషువ 22:23 యెహోవాను అనుసరింపక తొలగిపోయి, దహనబలినైనను నైవేద్య మునైనను దానిమీద అర్పించుటకే గాని సమా ధాన బలులను దానిమీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టినయెడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువుచేతనే ఈ బలిపీఠమును కట్టితివిు.

2సమూయేలు 18:19 సాదోకు కుమారుడైన అహిమయస్సునేను పరుగెత్తికొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదననగా

2రాజులు 19:28 నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.

2దినవృత్తాంతములు 24:22 ఈ ప్రకారము రాజైన యోవాషు జెకర్యా తండ్రియైన యెహోయాదా తనకు చేసిన ఉప కారమును మరచినవాడై అతని కుమారుని చంపించెను; అతడు చనిపోవునప్పుడు యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక యనెను.

2దినవృత్తాంతములు 24:25 వారు యోవాషును విడచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగియైయుండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతనిమీద కుట్రచేసి, అతడు పడకమీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరి గాని రాజుల సమాధులలో అతని పాతిపెట్టలేదు.

2దినవృత్తాంతములు 32:19 మరియు వారు మనుష్యుల చేతిపనియైన భూజనుల దేవతలమీద తాము పలికిన దూషణలను యెరూషలేముయొక్క దేవుని మీద కూడను పలికిరి.

యోబు 5:15 బలాఢ్యుల నోటి ఖడ్గమునుండి, వారిచేతిలోనుండి ఆయన దరిద్రులను రక్షించును.

యోబు 11:11 పనికిమాలినవారెవరో ఆయనే యెరుగును గదా పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలిసికొనును గదా.

యోబు 24:23 ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు ఆయన వారి మార్గముల మీద తన దృష్టినుంచును

యోబు 36:6 భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును.

కీర్తనలు 9:12 ఆయన రక్తాపరాధమునుగూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడువారిని జ్ఞాపకము చేసికొనును వారి మొఱ్ఱను ఆయన మరువడు.

కీర్తనలు 10:18 తండ్రిలేనివారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి.

కీర్తనలు 26:10 వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచెయ్యి లంచములతో నిండియున్నది.

కీర్తనలు 28:3 భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడుదురు

కీర్తనలు 35:10 అప్పుడు యెహోవా నీవంటివాడెవడు? మించిన బలముగలవారి చేతినుండి దీనులను దోచుకొనువారి చేతినుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా యెముకలన్నియు చెప్పుకొనును.

కీర్తనలు 35:17 ప్రభువా, నీవెన్నాళ్లు చూచుచు ఊరకుందువు? వారు నాశనము చేయకుండ నా ప్రాణమును రక్షింపుము నా ప్రాణమును సింహముల నోటనుండి విడిపింపుము

కీర్తనలు 86:1 యెహోవా, నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకుత్తరమిమ్ము

కీర్తనలు 103:6 యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికి న్యాయము తీర్చును

కీర్తనలు 109:16 ఏలయనగా కృప చూపవలెనన్న మాట మరచి శ్రమనొందినవానిని దరిద్రుని నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతని తరిమెను.

కీర్తనలు 109:31 దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచువారి చేతిలోనుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడిప్రక్కను నిలుచుచున్నాడు.

కీర్తనలు 146:7 బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడినవారిని విడుదలచేయును.

సామెతలు 10:3 యెహోవా నీతిమంతుని ఆకలిగొననియ్యడు భక్తిహీనుని ఆశను భంగముచేయును.

ప్రసంగి 9:1 నీతిమంతులును జ్ఞానులును వారి క్రియలును దేవుని వశమను సంగతిని, స్నేహము చేయుటయైనను ద్వేషించుటయైనను మనుష్యుల వశమున లేదను సంగతిని, అదియంతయు వారివలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింప బూనుకొంటిని.

యెషయా 37:17 సైన్యములకధిపతివగు యెహోవా, చెవి యొగ్గి ఆలకించుము; యెహోవా, కన్నులుతెరచి దృష్టించుము; జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపినవాని మాటలను చెవినిబెట్టుము.

యిర్మియా 11:20 నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించువాడు సైన్యములకధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యెభారమును నీమీదనే వేయుచున్నాను; వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము.

విలాపవాక్యములు 3:60 పగతీర్చుకొనవలెనని వారు నామీద చేయు ఆలోచనలన్నియు నీవెరుగుదువు.

యాకోబు 2:6 అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే గదా?

1పేతురు 2:23 ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.