Logo

కీర్తనలు అధ్యాయము 78 వచనము 25

కీర్తనలు 68:9 దేవా, నీ స్వాస్థ్యముమీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి.

కీర్తనలు 105:40 వారు మనవిచేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశములోనుండి ఆహారమునిచ్చి వారిని తృప్తి పరచెను.

నిర్గమకాండము 16:4 యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశమునుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను.

నిర్గమకాండము 16:14 పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగు మంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను.

ద్వితియోపదేశాకాండము 8:3 ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను.

నెహెమ్యా 9:15 వారి ఆకలి తీర్చుటకు ఆకాశమునుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలోనుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారి కాజ్ఞాపించితివి.

నెహెమ్యా 9:20 వారికి భోధించుటకు నీ యుపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు; వారి దాహమునకు ఉదకమిచ్చితివి.

యోహాను 6:31 భుజించుటకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి.

యోహాను 6:32 కాబట్టి యేసు పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు.

యోహాను 6:33 పరలోకమునుండి దిగివచ్చి, లోకమునకు జీవమునిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమైయున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.

యోహాను 6:34 కావున వారు ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించుమనిరి.

యోహాను 6:35 అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,

యోహాను 6:36 నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు.

యోహాను 6:37 మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని.

యోహాను 6:38 తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను.

యోహాను 6:39 నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని.

యోహాను 6:40 ఆయన నాకు అనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.

యోహాను 6:41 కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.

యోహాను 6:42 కాబట్టి నేను పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా?

యోహాను 6:43 ఈయన తలిదండ్రులను మనమెరుగుదుము గదా? నేను పరలోకమునుండి దిగివచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.

యోహాను 6:44 అందుకు యేసు మీలో మీరు సణుగుకొనకుడి;

యోహాను 6:45 నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నాయొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

యోహాను 6:46 వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.

యోహాను 6:47 దేవునియొద్దనుండి వచ్చినవాడు తప్ప మరియెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నవాడు.

యోహాను 6:48 విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే.

యోహాను 6:49 మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.

యోహాను 6:50 దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమిదే.

యోహాను 6:51 పరలోకమునుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

యోహాను 6:52 యూదులు ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.

యోహాను 6:53 కావున యేసు ఇట్లనెను మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు.

యోహాను 6:54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

యోహాను 6:55 నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునైయున్నది.

యోహాను 6:56 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.

యోహాను 6:57 జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.

యోహాను 6:58 ఇదే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు గాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను

యోహాను 6:59 ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను.

యోహాను 6:60 ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.

యోహాను 6:61 యేసు తన శిష్యులు దీనినిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెను దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా?

యోహాను 6:62 ఆలాగైతే మనుష్యకుమారుడు మునుపున్నచోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు?

యోహాను 6:63 ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని

యోహాను 6:64 మీలో విశ్వసించనివారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యేసునకు తెలియును.

యోహాను 6:65 మరియు ఆయన తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను.

యోహాను 6:66 అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.

యోహాను 6:67 కాబట్టి యేసు మీరుకూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా

యోహాను 6:68 సీమోను పేతురు ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;

యోహాను 6:69 నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను.

యోహాను 6:70 అందుకు యేసు నేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను.

యోహాను 6:71 సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండుమందిలో ఒకడైయుండి ఆయననప్పగింపబోవుచుండెను గనుక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.

1కొరిందీయులకు 10:3 అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి;

నిర్గమకాండము 16:22 ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజము యొక్క అధికారులందరు వచ్చి అది మోషేకు తెలిపిరి.

కీర్తనలు 78:31 దేవుని కోపము వారిమీదికి దిగెను వారిలో బలిసినవారిని ఆయన సంహరించెను ఇశ్రాయేలులో యౌవనులను కూల్చెను.

ఆదికాండము 7:11 నోవహు వయసు యొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపుతూములు విప్పబడెను.

నిర్గమకాండము 16:35 ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలుబది యేండ్లు మన్నానే తినుచుండిరి; వారు కనాను దేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి.

సంఖ్యాకాండము 21:5 కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి.

ద్వితియోపదేశాకాండము 29:6 మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమేగాని మద్యమేగాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

1రాజులు 17:6 అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొని వచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను.