Logo

కీర్తనలు అధ్యాయము 78 వచనము 33

సంఖ్యాకాండము 14:1 అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను; ప్రజలు ఆ రాత్రి యెలుగెత్తి యేడ్చిరి.

సంఖ్యాకాండము 14:2 మరియు ఇశ్రాయేలీయులందరు మోషే అహరోనులపైని సణుగుకొనిరి.

సంఖ్యాకాండము 14:3 ఆ సర్వసమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు? ఈ అరణ్యమందు మేమేల చావలేదు? మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసికొనివచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు; తిరిగి ఐగుప్తుకు వెళ్లుట మాకు మేలుకాదా? అని వారితో అనిరి.

సంఖ్యాకాండము 14:4 వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్లుదమని ఒకనితోఒకడు చెప్పుకొనగా

సంఖ్యాకాండము 14:5 మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజసంఘము ఎదుట సాగిలపడిరి.

సంఖ్యాకాండము 14:6 అప్పుడు దేశమును సంచరించి చూచినవారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని

సంఖ్యాకాండము 14:7 ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము.

సంఖ్యాకాండము 14:8 యెహోవా మనయందు ఆనందించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును;. అది పాలు తేనెలు ప్రవహించు దేశము.

సంఖ్యాకాండము 14:9 మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారిమీదనుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడైయున్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా

సంఖ్యాకాండము 14:10 ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయుల కందరికి కనబడెను.

సంఖ్యాకాండము 14:11 యెహోవా ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్లవరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు?

సంఖ్యాకాండము 14:12 నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతముచేసి, యీ జనముకంటె మహా బలముగల గొప్ప జనమును నీవలన పుట్టించెదనని మోషేతో చెప్పగా

సంఖ్యాకాండము 14:13 మోషే యెహోవాతో ఇట్లనెను ఆలాగైతే ఐగుప్తీయులు దానిగూర్చి విందురు; నీవు నీ బలముచేత ఈ జనమును ఐగుప్తీయులలోనుండి రప్పించితివిగదా; వీరు ఈ దేశనివాసులతో ఈ సంగతి చెప్పియుందురు.

సంఖ్యాకాండము 14:14 యెహోవా అను నీవు ఈ ప్రజలమధ్య నున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడినవాడవనియు, నీ మేఘము వారిమీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు గదా.

సంఖ్యాకాండము 14:15 కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపినయెడల నీ కీర్తినిగూర్చి వినిన జనములు

సంఖ్యాకాండము 14:16 ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తిలేక యెహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు.

సంఖ్యాకాండము 14:17 యెహోవా దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును

సంఖ్యాకాండము 14:18 దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికి తెచ్చువాడునై యున్నాడని నీవు చెప్పిన మాటచొప్పున నా ప్రభువుయొక్క బలము ఘనపరచబడును గాక

సంఖ్యాకాండము 14:19 ఐగుప్తులోనుండి వచ్చినది మొదలుకొని యిదివరకు నీవు ఈ ప్రజలదోషమును పరిహరించియున్నట్లు నీ కృపాతిశయమునుబట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా

సంఖ్యాకాండము 14:20 యెహోవా నీ మాటచొప్పున నేను క్షమించియున్నాను.

సంఖ్యాకాండము 14:21 అయితే నా జీవముతోడు, భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండును.

సంఖ్యాకాండము 14:22 నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి.

సంఖ్యాకాండము 14:23 కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు; నన్ను అలక్ష్యము చేసినవారిలో ఎవరును దానిని చూడరు.

సంఖ్యాకాండము 14:24 నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను.

సంఖ్యాకాండము 14:25 అతని సంతతి దాని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులును కనానీయులును ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎఱ్ఱసముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమైపొండనెను.

సంఖ్యాకాండము 14:26 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

సంఖ్యాకాండము 14:27 నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను.

సంఖ్యాకాండము 14:28 నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవముతోడు; మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీయెడల చేసెదను.

సంఖ్యాకాండము 14:29 మీ శవములు ఈ అరణ్యములోనే రాలును; మీ లెక్కమొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరు, అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలిగి నాకు విరోధముగా సణగినవారందరు రాలిపోవుదురు.

సంఖ్యాకాండము 14:30 యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణముచేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు; ఇది నిశ్చయము.

సంఖ్యాకాండము 14:31 అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోపలికి రప్పించెదను; మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు;

సంఖ్యాకాండము 14:32 అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును.

సంఖ్యాకాండము 14:33 మీ శవములు ఈ అరణ్యములో క్షయమగువరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలుబది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు.

సంఖ్యాకాండము 14:34 మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు.

సంఖ్యాకాండము 14:35 ఇది యెహోవా అను నేను చెప్పిన మాట; నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసెదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు; ఇక్కడనే చనిపోవుదురు అనెను.

సంఖ్యాకాండము 14:36 ఆ దేశమును సంచరించి చూచుటకై మోషేచేత పంపబడి తిరిగివచ్చి ఆ దేశమునుగూర్చి చెడ్డసమాచారము చెప్పుటవలన సర్వ సమాజము అతనిమీద సణుగునట్లు చేసిన మనుష్యులు,

సంఖ్యాకాండము 14:37 అనగా ఆ దేశమునుగూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులుచేత చనిపోయిరి.

సంఖ్యాకాండము 14:38 అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రదికిరి.

సంఖ్యాకాండము 14:39 మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాల దుఃఖించిరి.

సంఖ్యాకాండము 14:40 వారు ఉదయమున లేచి ఆ కొండ కొనమీదికెక్కి చిత్తమండి, మేము పాపము చేసినవారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్లుదుము అనిరి.

సంఖ్యాకాండము 14:41 అప్పుడు మోషే ఇది ఏల? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి?

సంఖ్యాకాండము 14:42 అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడుగనుక మీ శత్రువులయెదుట హతము చేయబడుదురు; మీరు సాగిపోకుడి.

సంఖ్యాకాండము 14:43 ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటె ముందుగా అక్కడికి చేరియున్నారు; మీరు ఖడ్గముచేత కూలుదురు; మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడైయుండడని చెప్పెను.

సంఖ్యాకాండము 14:44 అయితే వారు మూర్ఖించి ఆ కొండకొనకెక్కి పోయిరి; అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేయైనను పాళెములోనుండి బయలువెళ్లలేదు.

సంఖ్యాకాండము 14:45 అప్పుడు ఆ కొండమీద నివాసముగానున్న అమాలేకీయులును కనానీయులును దిగివచ్చి వారిని కొట్టి హోర్మావరకు వారిని తరిమి హతముచేసిరి.

సంఖ్యాకాండము 16:1 లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని

సంఖ్యాకాండము 17:13 యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును; మేము అందరము చావవలసియున్నదా? అని పలికిరి.

సంఖ్యాకాండము 21:1 ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణదిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని, అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసి వారిలో కొందిరిని చెరపట్టగా

సంఖ్యాకాండము 21:2 ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని నీవు మాచేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించినయెడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసెదమనిరి.

సంఖ్యాకాండము 21:3 యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను.

సంఖ్యాకాండము 21:4 వారు ఎదోముదేశమును చుట్టిపోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గాయాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను.

సంఖ్యాకాండము 21:5 కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి.

సంఖ్యాకాండము 21:6 అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి.

సంఖ్యాకాండము 25:1 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి.

సంఖ్యాకాండము 25:2 ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి.

సంఖ్యాకాండము 25:3 అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను.

సంఖ్యాకాండము 25:4 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ప్రజల అధిపతులనందరిని తోడుకొని, యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీదనుండి తొలగిపోవునని చెప్పెను.

సంఖ్యాకాండము 25:5 కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలిసికొనిన తన తన వశములోని వారిని చంపవలెనని చెప్పెను.

సంఖ్యాకాండము 25:6 ఇదిగో మోషే కన్నులయెదుటను, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వసమాజముయొక్క కన్నులయెదుటను, ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరులయొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొనివచ్చెను.

సంఖ్యాకాండము 25:7 యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి,

సంఖ్యాకాండము 25:8 సమాజమునుండి లేచి, యీటెను చేతపట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవునట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచిపోయెను.

సంఖ్యాకాండము 25:9 ఇరువది నాలుగువేలమంది ఆ తెగులుచేత చనిపోయిరి.

సంఖ్యాకాండము 25:10 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,

సంఖ్యాకాండము 25:11 వారి మధ్యను నేను ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయులమీదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు.

సంఖ్యాకాండము 25:12 కాబట్టి నీవు అతనితో ఇట్లనుము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను.

సంఖ్యాకాండము 25:13 అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.

సంఖ్యాకాండము 25:14 చంపబడిన వాని పేరు జిమీ, అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధానియైన సాలూ కుమారుడు.

సంఖ్యాకాండము 25:15 చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధానియై యుండెను.

సంఖ్యాకాండము 25:16 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను మిద్యానీయులు తమ తంత్రములవలన మీకు బాధకులై యున్నారు; వారిని బాధపెట్టి హతము చేయుడి;

సంఖ్యాకాండము 25:17 వారు తంత్రములుచేసి పెయోరు సంతతిలోను,

సంఖ్యాకాండము 25:18 తెగులు దినమందు పెయోరు విషయములో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బీ సంగతిలోను, మిమ్మును మోసపుచ్చిరి.

యెహెజ్కేలు 20:13 అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడల ననుసరింపక, తాము అనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా, అరణ్యమందు నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకొంటిని.

కీర్తనలు 78:22 వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణయందు నమ్మిక యుంచలేదు.

లూకా 16:31 అందుకతడు మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను.

యోహాను 12:37 యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి.

సంఖ్యాకాండము 14:11 యెహోవా ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్లవరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు?

2రాజులు 17:14 వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి.

కీర్తనలు 78:17 అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి.

యోహాను 20:25 గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను.

1కొరిందీయులకు 10:5 అయితే వారిలో ఎక్కువమంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి.

హెబ్రీయులకు 11:6 విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.