Logo

కీర్తనలు అధ్యాయము 119 వచనము 16

కీర్తనలు 119:23 అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాటలాడుకొందురు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును.

కీర్తనలు 119:48 నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలతట్టు నా చేతులెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించుదును. జాయిన్‌.

కీర్తనలు 119:78 నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక.

కీర్తనలు 119:97 (మేమ్‌) నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.

కీర్తనలు 119:131 నీ ఆజ్ఞలయందైన యధిక వాంఛచేత నేను నోరుతెరచి ఒగర్చుచున్నాను.

కీర్తనలు 119:148 నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచుకొందును.

కీర్తనలు 1:2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.

యాకోబు 1:25 అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.

కీర్తనలు 119:6 నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు.

కీర్తనలు 119:117 నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను.

ఆదికాండము 24:63 సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను,

యెహోషువ 1:8 ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపో కూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.

కీర్తనలు 104:34 ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను.

సామెతలు 12:5 నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు.

1తిమోతి 4:15 నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.