Logo

కీర్తనలు అధ్యాయము 119 వచనము 86

కీర్తనలు 119:78 నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక.

కీర్తనలు 7:15 వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను.

కీర్తనలు 35:7 నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి.

కీర్తనలు 36:11 గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనియ్యకుము.

సామెతలు 16:27 పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవులమీద అగ్ని మండుచున్నట్టున్నది.

యిర్మియా 18:20 వారు నా ప్రాణము తీయవలెనని గుంట త్రవ్వియున్నారు; చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలుగవలెనని వారిమీదనుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారిపక్షముగా మాటలాడిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.

కీర్తనలు 58:1 అధిపతులారా, మీరు నీతిననుసరించి మాటలాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమునుబట్టి తీర్పు తీర్చుదురా?

కీర్తనలు 58:2 లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీచేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు.

నిర్గమకాండము 21:33 ఒకడు గోతిమీది కప్పు తీయుటవలన, లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవుటవలన, దానిలో ఎద్దయినను గాడిదయైనను పడినయెడల

కీర్తనలు 10:2 దుష్టుడు గర్వించి, దీనుని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురు గాక

కీర్తనలు 86:14 దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచియున్నారు బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణము తీయజూచుచున్నారు వారు నిన్ను లక్ష్యపెట్టనివారైయున్నారు.

కీర్తనలు 119:95 నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను.

కీర్తనలు 119:110 నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుటలేదు.

కీర్తనలు 140:5 గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారు వారు త్రోవప్రక్కను వల పరచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. (సెలా.)