Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 4 వచనము 2

ద్వితియోపదేశాకాండము 12:32 నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.

యెహోషువ 1:7 అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞా పించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు.

సామెతలు 30:6 ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.

ప్రసంగి 12:13 ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.

మత్తయి 5:18 ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

మత్తయి 5:43 నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా;

మత్తయి 15:2 నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే, వారెందునిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి

మత్తయి 15:3 అందుకాయన మీరును మీపారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు?

మత్తయి 15:4 తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలచిచ్చెను.

మత్తయి 15:5 మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పినయెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు.

మత్తయి 15:6 మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.

మత్తయి 15:7 వేషధారులారా

మత్తయి 15:8 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది;

మత్తయి 15:9 మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి

మార్కు 7:1 యెరూషలేమునుండి వచ్చిన పరిసయ్యులును శాస్త్రులలో కొందరును ఆయనయొద్దకు కూడివచ్చి

మార్కు 7:2 ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి.

మార్కు 7:3 పరిసయ్యులును యూదులందరును పెద్దల పారంపర్యాచారమునుబట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు.

మార్కు 7:4 మరియు వారు సంతనుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకొంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేకాచారములను వారనుసరించెడివారు.

మార్కు 7:5 అప్పుడు పరిసయ్యులును శాస్త్రులును నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక, అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన నడిగిరి.

మార్కు 7:6 అందుకాయన వారితో ఈలాగు చెప్పెను ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది.

మార్కు 7:7 వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయా ప్రవచించినది సరియే.

మార్కు 7:8 మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు.

మార్కు 7:9 మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు.

మార్కు 7:10 నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా.

మార్కు 7:11 అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నావలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పినయెడల,

మార్కు 7:12 తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమియు చేయనియ్యక

మార్కు 7:13 మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను.

గలతీయులకు 3:15 సహోదరులారా, మనుష్యరీతిగా మాటలాడుచున్నాను; మనుష్యుడు చేసిన ఒడంబడికయైనను స్థిరపడిన తరువాత ఎవడును దాని కొట్టివేయడు, దానితో మరేమియు కలుపడు.

ప్రకటన 22:18 ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;

ప్రకటన 22:19 ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలులేకుండ చేయును.

నిర్గమకాండము 7:2 నేను నీకాజ్ఞాపించునది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్యవలెనని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పును;

నిర్గమకాండము 12:50 ఇశ్రాయేలీయులందరు ఆలాగు చేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.

నిర్గమకాండము 34:11 నేడు నేను నీకాజ్ఞాపించుదాని ననుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను కనానీయులను హిత్తీయులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను నీ యెదుటనుండి వెళ్లగొట్టెదను.

నిర్గమకాండము 35:29 మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటికొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరు మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి.

లేవీయకాండము 8:36 యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్ని అహరోనును అతని కుమారులును చేసిరి.

లేవీయకాండము 10:1 అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటిమీద ధూపద్రవ్యము వేసి, యెహోవా తమకాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా

లేవీయకాండము 18:4 మీరు నా విధులను గైకొనవలెను; నా కట్టడలనుబట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను; మీ దేవుడనగు నేను యెహోవాను.

లేవీయకాండము 18:26 కాబట్టి ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతనుబట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు,

లేవీయకాండము 19:37 కాగా మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను; నేను యెహోవాను.

ద్వితియోపదేశాకాండము 5:32 వారు స్వాధీనపరచుకొనునట్లు నేను వారికిచ్చుచున్న దేశమందు వారు ఆలాగు ప్రవర్తింపవలెను.

ద్వితియోపదేశాకాండము 12:1 మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమిమీద బ్రదుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలును విధులును ఇవి.

ద్వితియోపదేశాకాండము 17:20 తన రాజ్యమందు తానును తన కుమారులును ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై

యెహోషువ 8:35 యెహోషువ సర్వసమాజము నెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాటయొక్క టియు లేదు.

యెహోషువ 11:15 యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించి నట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను, యెహోషువ ఆలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొకటియు అతడు చేయక విడువలేదు.

యెహోషువ 22:5 అయితే మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు, ఆయనమార్గములన్ని టిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు, యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్ర మును అనుసరించి నడుచుకొనుడి.

2దినవృత్తాంతములు 30:12 యెహోవా ఆజ్ఞనుబట్టి రాజును అధిపతులును చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోనివారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను.

యోబు 22:22 ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము.

యిర్మియా 26:2 యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి, నేను నీ కాజ్ఞాపించు మాటలన్నిటిని యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికి ప్రకటింపుము; వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు.

గలతీయులకు 1:9 మేమిదివరకు చెప్పినప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించినయెడల వాడు శాపగ్రస్తుడవును గాక.