Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 4 వచనము 49

ద్వితియోపదేశాకాండము 3:17 కిన్నెరెతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గా కొండచరియల దిగువగా, ఉప్పు సముద్రము అనబడివ అరాబా సముద్రమువరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్యభూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని.

ద్వితియోపదేశాకాండము 34:1 మోషే మోయాబు మైదానమునుండి యెరికో యెదుటనున్న పిస్గాకొండవరకు పోయి నెబోశిఖరమున కెక్కెను.

యెహోషువ 13:20 బెత్యేషి మోతు అను పట్టణములును మైదానములోని పట్టణము లన్నియు, హెష్బోనులో ఏలికయు,

సంఖ్యాకాండము 21:20 మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతునుండి యెడారికి ఎదురుగానున్న పిస్గాకొండకు వచ్చిరి.

సంఖ్యాకాండము 23:14 పిస్గా కొననున్న కావలివారి పొలమునకు అతని తోడుకొనిపోయి, యేడు బలిపీఠములను కట్టించి, ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.

ద్వితియోపదేశాకాండము 3:9 సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు. అమోరీయులు దానిని శెనీరని అందురు.

ద్వితియోపదేశాకాండము 3:10 మైదానమందలి పురములన్నిటిని బాషానునందలి ఓగు రాజ్య పురములైన సల్కా ఎద్రెయీ అనువాటివరకు గిలాదంతటిని బాషానును పట్టుకొంటిమి.

యెహోషువ 9:1 యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారి రాజులందరు జరిగినదానిని వినినప్పుడు

యెహోషువ 12:3 అరాబా సముద్రమువరకును, దక్షిణదిక్కున పిస్గాకొండచరియల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు.

యెహెజ్కేలు 47:8 అప్పుడాయన నాతో ఇట్లనెను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపునీళ్లు మంచినీళ్లు అగును.