Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 32 వచనము 25

లేవీయకాండము 26:36 మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను; కొట్టుకొనిపోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుటనుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు; తరుమువాడు లేకయే పడెదరు.

లేవీయకాండము 26:37 తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకనిమీదనొకడు పడెదరు; మీ శత్రువులయెదుట మీరు నిలువలేకపోయెదరు.

యెషయా 30:16 అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుఱ్ఱములనెక్కి పారిపోవుదుమంటిరి కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుఱ్ఱములను ఎక్కి పోయెదమంటిరే కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు.

యిర్మియా 9:21 వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజ మార్గములలో యౌవనులు లేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది.

విలాపవాక్యములు 1:20 యెహోవా, దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమునుబట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి.

యెహెజ్కేలు 7:15 బయట ఖడ్గమున్నది లోపట తెగులును క్షామమును ఉన్నవి, బయటనున్న వారు ఖడ్గముచేత చత్తురు, పట్టణములోనున్న వారిని క్షామమును తెగులును మింగును.

2కొరిందీయులకు 7:5 మేము మాసిదోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను; వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను.

విలాపవాక్యములు 2:19 నీవులేచి రేయి మొదటిజామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముకొరకు నీచేతులను ఆయనతట్టు ఎత్తుము ప్రతి వీధిమొగను అకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు

విలాపవాక్యములు 2:20 నీవు ఎవనియెడల ఈ ప్రకారము చేసితివో యెహోవా, దృష్టించిచూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువుయొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగువా?

విలాపవాక్యములు 2:21 యౌవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు నా కన్యకలును నా యౌవనులును ఖడ్గముచేత కూలియున్నారు నీ ఉగ్రతదినమున నీవు వారిని హతముచేసితివి దయతలచక వారినందరిని వధించితివి.

విలాపవాక్యములు 2:22 ఉత్సవదినమున జనులు వచ్చునట్లుగా నలుదిశలనుండి నీవు నామీదికి భయోత్పాతములను రప్పించితివి. యెహోవా ఉగ్రతదినమున ఎవడును తప్పించుకొనలేకపోయెను శేషమేమియు నిలువకపోయెను నేనుచేతులలో ఆడించి సాకినవారిని శత్రువులు హరించివేసియున్నారు.

విలాపవాక్యములు 4:4 దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును పసిపిల్లలు అన్నమడుగుదురు ఎవడును వారికి పెట్టడు.

లేవీయకాండము 19:18 కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచుకొనక నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.

లేవీయకాండము 26:16 నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాప జ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటిపంటను తినెదరు;

లేవీయకాండము 26:25 మీమీదికి ఖడ్గమును రప్పించెదను; అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును; మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను; మీరు శత్రువులచేతికి అప్పగింపబడెదరు.

ద్వితియోపదేశాకాండము 7:10 ఆయన తన్ను ద్వేషించువాని విషయము ఆలస్యముచేయక బహిరంగముగా వానికి దండన విధించును

2రాజులు 7:5 సందెచీకటియందు సిరియనుల దండుపేటలోనికి పోవలెనని లేచి, సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరును కనబడకపోయిరి.

2రాజులు 25:4 కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోటదగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి.

యెషయా 5:27 వారిలో అలసినవాడైనను తొట్రిల్లువాడైనను లేడు. వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షలవారు తెగిపోదు.

యెషయా 65:12 నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైనదాని చేసితిరి నాకిష్టము కానిదాని కోరితిరి నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును మీరందరు వధకు లోనగుదురు.

యిర్మియా 18:21 వారి కుమారులను క్షామమునకు అప్పగింపుము, ఖడ్గ బలమునకు వారిని అప్పగింపుము, వారి భార్యలు పిల్లలులేనివారై విధవరాండ్రగుదురు గాక, వారి పురుషులు మరణహతులగుదురు గాక, వారి యౌవనులు యుద్ధములో ఖడ్గముచేత హతులగుదురు గాక.

యిర్మియా 32:24 ముట్టడిదిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి, ఖడ్గము క్షామము తెగులు వచ్చుటవలన దానిమీద యుద్ధముచేయుచుండు కల్దీయులచేతికి ఈ పట్టణము అప్పగింపబడును; నీవు సెలవిచ్చినది సంభవించెను, నీవే దాని చూచుచున్నావు గదా?

యిర్మియా 44:7 కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు అజ్ఞ ఇచ్చుచున్నాడు ఏమియు శేషములేకుండ స్త్రీ పురుషులును శిశువులును చంటిబిడ్డలును యూదా మధ్యనుండకుండ నిర్మూలము చేయబడునట్లుగా మీరేల ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసికొనుచున్నారు?

యిర్మియా 51:3 విలుకానిమీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను కవచము వేసికొనువానిమీదికిని విల్లు త్రొక్కవలెను కల్దీయులదేశములో జనులు హతులై పడునట్లును దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును

యిర్మియా 51:6 మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులోనుండి పారిపోవుడి మీ ప్రాణములు రక్షించుకొనుడి ఇది యెహోవాకు ప్రతికారకాలము అది చేసిన క్రియలనుబట్టి ఆయన దానికి ప్రతికారము చేయుచున్నాడు.

యిర్మియా 51:22 నీవలన స్త్రీలను పురుషులను విరుగగొట్టుచున్నాను నీవలన ముసలివారిని బాలురను విరుగగొట్టుచున్నాను నీవలన యౌవనులను కన్యకలను విరుగగొట్టుచున్నాను.

హోషేయ 9:12 వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరును లేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును.

హోషేయ 11:6 వారు చేయుచున్న యోచనలనుబట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును; అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మింగివేయును.

ఆమోసు 8:13 ఆ దినమందు చక్కని కన్యలును యౌవనులును దప్పిచేత సొమ్మసిల్లుదురు.