Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 32 వచనము 49

ద్వితియోపదేశాకాండము 34:1 మోషే మోయాబు మైదానమునుండి యెరికో యెదుటనున్న పిస్గాకొండవరకు పోయి నెబోశిఖరమున కెక్కెను.

సంఖ్యాకాండము 33:47 అల్మోను దిబ్లాతాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబారీము కొండలలో దిగిరి.

సంఖ్యాకాండము 33:48 అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి.

ద్వితియోపదేశాకాండము 34:2 అప్పుడు యెహోవా దానువరకు గిలాదు దేశమంతయు నఫ్తాలి దేశమంతయు ఎఫ్రాయిము మనష్షేల దేశమును పశ్చిమ సముద్రమువరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును

ద్వితియోపదేశాకాండము 34:3 సోయరువరకు ఈతచెట్లుగల యెరికో లోయచుట్టు మైదానమును అతనికి చూపించెను.

ద్వితియోపదేశాకాండము 34:4 మరియు యెహోవా అతనితో ఇట్లనెను నీ సంతానమునకిచ్చెదనని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులార నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు నదిదాటి అక్కడికి వెళ్లకూడదు.

ద్వితియోపదేశాకాండము 34:5 యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాటచొప్పున మోయాబు దేశములో మృతినొందెను.

యెషయా 33:17 అలంకరింపబడిన రాజును నీవు కన్నులార చూచెదవు బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును.

2కొరిందీయులకు 5:1 భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.

లేవీయకాండము 14:34 నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగజేసినయెడల

లేవీయకాండము 25:2 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమికూడ యెహోవా పేరట విశ్రాంతికాలమును, ఆచరింపవలెను.

సంఖ్యాకాండము 20:12 అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నులయెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొనిపోరని చెప్పెను.

సంఖ్యాకాండము 20:28 మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండదిగి వచ్చిరి.

సంఖ్యాకాండము 26:65 ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారినిగూర్చి సెలవిచ్చెను. యెపున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.

సంఖ్యాకాండము 27:12 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఈ అబారీము కొండయెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము.

ద్వితియోపదేశాకాండము 32:52 ఎదురుగా ఆ దేశమును చూచెదవు కాని నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు.

1దినవృత్తాంతములు 5:8 యోవేలు కుమారుడైన షెమకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెలయును. బెల వంశపువారు అరోయేరునందును నెబోవరకును బయల్మెయోనువరకును కాపురముండిరి.

ఎజ్రా 2:29 నెబో వంశస్థులు ఏబది ఇద్దరు,