లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 2: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 9:5

షిలోనీయుల పెద్దవాడైన ఆశాయాయు వాని పిల్లలును.

ఆదికాండము 38:2

అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసికొని ఆమెతో పోయెను.

ఆదికాండము 38:3

ఆమె గర్భవతియై కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను.

ఆదికాండము 38:4

ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను.

ఆదికాండము 38:5

ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులో నుండెను.

ఆదికాండము 38:6

యూదా తన జ్యేష్ఠకుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను.

ఆదికాండము 38:7

యూదా జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను.

ఆదికాండము 38:8

అప్పుడు యూదా ఓనానుతో నీ అన్నభార్యయొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయుమని చెప్పెను.

ఆదికాండము 38:9

ఓనాను ఆ సంతానము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను.

ఆదికాండము 38:10

అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనికూడ చంపెను.

ఆదికాండము 46:12

యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు.

సంఖ్యాకాండము 26:19

యూదా కుమారులు ఏరు ఓనాను; ఏరును ఓనానును కనాను దేశములో మృతిబొందిరి.

ఆదికాండము 38:7

యూదా జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను.

సంఖ్యాకాండము 26:20

యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీయులు జెరహు వంశస్థులు;

2సమూయేలు 19:42

యూదా వారందరు రాజు మీకు సమీపబంధువుడై యున్నాడు గదా, మీకు కోపమెందుకు? ఆలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనను తింటిమా? మాకు యినాము ఏమైన ఇచ్చెనా? అని ఇశ్రాయేలువారితో అనిరి.

1దినవృత్తాంతములు 4:21

యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధానియైన ఏరు మారేషాకు ప్రధానియైన లద్దాయు; సన్నపు వస్త్రములు నేయు అష్బేయ యింటి వంశకులకును

1దినవృత్తాంతములు 29:24

అధిపతులందరును యోధులందరును రాజైన దావీదు కుమారులందరును రాజైన సొలొమోనునకు లోబడిరి.

మత్తయి 1:3

యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;