లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 2: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 2:25

హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము బూనా ఓరెను ఓజెము అహీయా.

1దినవృత్తాంతములు 2:26

అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను, ఇది ఓనామునకు తల్లి.

1దినవృత్తాంతములు 2:27

యెరహ్మెయేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమారులు మయజు యామీను ఏకెరు.

1దినవృత్తాంతములు 2:28

ఓనాము కుమారులు షమ్మయి యాదా, షమ్మయి కుమారులు నాదాబు అబీషూరు.

1దినవృత్తాంతములు 2:29

అబీషూరు భార్యపేరు అబీహయిలు, అది అతనికి అహ్బానును, మొలీదును కనెను.

1దినవృత్తాంతములు 2:30

నాదాబు కుమారులు సెలెదు అప్పయీము. సెలెదు సంతానములేకుండ చనిపోయెను

1దినవృత్తాంతములు 2:31

అప్పయీము కుమారులలో ఇషీ అను ఒకడుండెను, ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను, షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను,

1దినవృత్తాంతములు 2:32

షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు యెతెరు యోనాతాను; యెతెరు సంతానములేకుండ చనిపోయెను.

1దినవృత్తాంతములు 2:33

యోనాతాను కుమారులు పేలెతు జాజా; వీరు యెరహ్మెయేలునకు పుట్టినవారు.

మత్తయి 1:3

యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;

లూకా 3:3

అంతట అతడు వచ్చి, పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యొర్దాను నదీ ప్రదేశమందంతట ప్రకటించుచుండెను.

1దినవృత్తాంతములు 2:18

హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను.

1దినవృత్తాంతములు 2:19

అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను.

1దినవృత్తాంతములు 2:24

కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను.

1దినవృత్తాంతములు 2:42

యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.

1సమూయేలు 27:10

ఆకీషు ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదు నడుగగా దావీదు యూదా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమునకును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను.

1సమూయేలు 30:29

రాకాలులోను యెరహ్మెయేలీయుల గ్రామములలోను కేనీయుల గ్రామములలోను

1దినవృత్తాంతములు 4:1

యూదా కుమారులెవరనగా పెరెసు హెష్రోను కర్మీ హూరు శోబాలు.

1దినవృత్తాంతములు 24:29

కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు.

లూకా 3:33

నయస్సోను అమ్మీనాదాబుకు, అమ్మీనాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు,