లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 6: 55

క్రాస్-రిఫరెన్స్‌లు

" యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుపగ్రామములును వారికప్పగింపబడెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 14:13

యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహో వాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహో షువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను.

యెహోషువ 15:13

యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త యైన అర్బాయొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను.

యెహోషువ 21:11

యూదావంశస్థుల మన్య ములో వారికి కిర్యతర్బా, అనగా హెబ్రోను నిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టునున్న పొలమును వారి కిచ్చిరి.

యెహోషువ 21:12

అయితే ఆ పట్టణముయొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్య ముగా ఇచ్చిరి.

యెహోషువ 21:13

యాజకుడైన అహరోను సంతానపువారికి వారు నర హంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును

న్యాయాధిపతులు 1:20

మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను నియ్యగా అతడు ముగ్గురు అనాకీయులను అక్కడనుండి పారదోలి దానిని స్వాధీన పరచుకొనెను.

యెహోషువ 21:12

అయితే ఆ పట్టణముయొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్య ముగా ఇచ్చిరి.