లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 6: 63

క్రాస్-రిఫరెన్స్‌లు

" మెరారీయులకు వారి వంశములచొప్పున రూబేను గోత్రస్థానములోనుండియు, గాదు గోత్రస్థానములోనుండియు, జెబూలూను గోత్రస్థానములోనుండియు చీటిచేత పండ్రెండు పట్టణములు ఇయ్యబడెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 6:77

మరియు మెరారీయులలో శేషించినవారికి జెబూలూను గోత్రస్థానములోనుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు,

1దినవృత్తాంతములు 6:78

యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములోనుండి అరణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు,

1దినవృత్తాంతములు 6:79

కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు,

1దినవృత్తాంతములు 6:80

గాదు గోత్ర స్థానములోనుండి గిలాదు యందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు,

1దినవృత్తాంతములు 6:81

హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు, ఇయ్యబడెను.

ఆదికాండము 46:11

లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి

సంఖ్యాకాండము 3:20

మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి. వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు.

యెహోషువ 21:7

రూబేను గోత్రి కులనుండియు, గాదు గోత్రికులనుం డియు, జెబూలూను గోత్రికులనుండియు, వారి వంశములచొప్పున మెరారీయు లకు కలిగినవిపండ్రెండు పట్టణములు.

యెహోషువ 21:34

లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జెబూలూను గోత్రములనుండి నాలుగు పట్టణములను, అనగా యొక్నెయాము దాని పొలమును

యెహోషువ 21:35

కర్తాను దాని పొలమును దిమ్నాను దాని పొలమును నహలాలును దాని పొలమును ఇచ్చిరి.

యెహోషువ 21:36

రూబేను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా బేసెరును దాని పొలమును యాహ సును దాని పొలమును

యెహోషువ 21:37

కెదెమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి.

యెహోషువ 21:38

గాదు గోత్రికుల నుండి నాలుగు పట్టణములును, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు గిలాదులోని రామోతును దాని పొల మును మహనయీమును దాని పొలమును

యెహోషువ 21:39

హెష్బోనును దాని పొలమును యాజెరును దాని పొలమును ఇచ్చిరి.

యెహోషువ 21:40

వారి వారి వంశములచొప్పున, అనగా లేవీయుల మిగిలిన వంశములచొప్పున అవన్నియు మెరారీయులకు కలిగిన పట్టణములు. వంతుచీటివలన వారికి కలిగిన పట్టణములు పండ్రెండు.

1దినవృత్తాంతములు 9:14

మరియు లేవీయులలో మెరారి సంతతివాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హష్షూబు కుమారుడైన షెమయా,

సామెతలు 18:18

చీట్లు వేయుటచేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానపరచును.