Logo

కీర్తనలు అధ్యాయము 105 వచనము 5

ఆమోసు 5:4 ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చునదేమనగా నన్నాశ్రయించుడి, నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు.

ఆమోసు 5:5 బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్లకుడి; గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును.

ఆమోసు 5:6 యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకుదురు, ఆశ్రయింపనియెడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండ అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతిమీద పడి దాని నాశనము చేయును.

జెఫన్యా 2:2 విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీమీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి.

జెఫన్యా 2:3 దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధులననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రతదినమున మీరు దాచబడుదురు.

కీర్తనలు 78:61 ఆయన తన బలమును చెరకును, తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను.

కీర్తనలు 132:8 యెహోవా, లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడ రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము.

2దినవృత్తాంతములు 6:41 నా దేవా, యెహోవా, బలమునకాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక.

కీర్తనలు 27:8 నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను.

ఆదికాండము 12:15 ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో యెదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో యింటికి తేబడెను.

2దినవృత్తాంతములు 12:14 అతడు తన మనస్సు యెహోవాను వెదకుటయందు నిలుపుకొనక చెడుక్రియలు చేసెను.

2దినవృత్తాంతములు 14:7 అతడు యూదావారికి ఈలాగు ప్రకటన చేసెను మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితివిు, ఆశ్రయించినందున ఆయన మన చుట్టును నెమ్మది కలుగజేసియున్నాడు; దేశమందు మనము నిరభ్యంతరముగా తిరుగవచ్చును, మనము ఈ పట్టణములను కట్టించి, వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధినొందిరి.

కీర్తనలు 9:10 యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు

కీర్తనలు 22:26 దీనులు భోజనముచేసి తృప్తిపొందెదరు యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రదుకును.

కీర్తనలు 24:6 ఆయన నాశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. (సెలా.)

కీర్తనలు 63:2 నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీతట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేక యెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.

యెషయా 51:1 నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండువారలారా, నా మాట వినుడి మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి మీరు ఏ గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలోచించుడి

యిర్మియా 50:4 ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలువారును యూదావారును కూడి వచ్చెదరు ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవాయొద్ద విచారించుటకై వచ్చెదరు

యెహెజ్కేలు 24:21 ఇశ్రాయేలీయులకు నీవీలాగున ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీకు అతిశయాస్పదముగాను, మీ కన్నులకు ముచ్చటగాను, మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోవుచున్నాను, మీరు వెనుక విడిచిన మీ కుమారులును కుమార్తెలును అక్కడనే ఖడ్గముచేత కూలుదురు.

హోషేయ 10:12 నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి.

మత్తయి 7:7 అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.

మత్తయి 28:5 దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును;

మార్కు 16:6 అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి.

లూకా 11:9 అటువలె మీరును అడుగుడి, మీకియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును.

హెబ్రీయులకు 11:6 విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.