Logo

కీర్తనలు అధ్యాయము 105 వచనము 19

ఆదికాండము 39:20 అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను.

ఆదికాండము 40:15 ఏలయనగా నేను హెబ్రీయుల దేశములోనుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పెను.

అపోస్తలులకార్యములు 16:24 అతడు అట్టి ఆజ్ఞను పొంది, వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్లకు బొండవేసి బిగించెను.

కీర్తనలు 107:10 దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున

ఆదికాండము 41:52 తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధిపొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను.

యోబు 33:11 ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటిని కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు.

అపోస్తలులకార్యములు 12:7 ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతని చేతులనుండి ఊడిపడెను.

హెబ్రీయులకు 11:36 మరికొందరు తిరస్కారములను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభవించిరి.