Logo

కీర్తనలు అధ్యాయము 105 వచనము 9

కీర్తనలు 105:42 ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తనసేవకుడైన అబ్రాహామును జ్ఞాపకము చేసికొని

కీర్తనలు 111:5 తనయందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చియున్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసికొనును.

కీర్తనలు 111:9 ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది.

1దినవృత్తాంతములు 16:15 మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప సంఖ్యగల జనులుగాను కనాను దేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాని నీకిచ్చెదనని

నెహెమ్యా 1:5 ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా,

దానియేలు 9:4 నేను నా దేవుడైన యెహోవా యెదుట ప్రార్థన చేసి యొప్పుకొన్నదేమనగా ప్రభువా, మాహాత్మ్యము గలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారియెడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా,

లూకా 1:72 దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను.

లూకా 1:73 ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన

లూకా 1:74 అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును

ద్వితియోపదేశాకాండము 7:9 కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడు ననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను.

ఆదికాండము 17:2 నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధిపొందించెదనని అతనితో చెప్పెను.

ఆదికాండము 17:7 నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాతవారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.

ఆదికాండము 19:29 దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడుచేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసికొని, లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండ అతని తప్పించెను.

నిర్గమకాండము 6:5 ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసికొనియున్నాను.

ద్వితియోపదేశాకాండము 4:31 నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు; నిన్ను నాశనము చేయడు; తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు.

ద్వితియోపదేశాకాండము 5:3 యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీ నిబంధన చేసెను.

ద్వితియోపదేశాకాండము 7:8 అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములోనుండియు ఐగుప్తు రాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను.

ద్వితియోపదేశాకాండము 7:12 మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణముచేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును

2రాజులు 13:23 గాని యెహోవా వారిమీద జాలిపడి వారియందు దయయుంచి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్న నిబంధననుబట్టి వారియందు లక్ష్యము నిలిపి, వారిని నాశము చేయనొల్లక యిప్పటికిని తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టకయుండెను.

నెహెమ్యా 9:8 అతడు నమ్మకమైన మనస్సుగల వాడని యెరిగి, కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు యెబూసీయులు గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతివారికిచ్చునట్లు ఆతనితో నిబంధన చేసినవాడవు నీవే.

కీర్తనలు 74:20 లోకములోనున్న చీకటిగల చోటులు బలాత్కారుల నివాసములతో నిండియున్నవి. కాగా నిబంధనను జ్ఞాపకము చేసికొనుము

కీర్తనలు 106:45 వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.

కీర్తనలు 111:7 ఆయన చేతికార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నియు నమ్మకమైనవి.

యెహెజ్కేలు 16:60 నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును.

యెహెజ్కేలు 20:28 వారికిచ్చెదనని నేను ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేశములోనికి నేను వారిని రప్పించిన తరువాత, ఎత్తయిన యొక కొండనేగాని, దట్టమైన యొక వృక్షమునేగాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పించుచు, అర్పణలను అర్పించుచు, అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు, పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి.

మీకా 7:20 పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు.

హబక్కూకు 3:9 విల్లు వరలోనుండి తీయబడియున్నది నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరచియున్నావు (సెలా.) భూమిని బద్దలుచేసి నదులను కలుగజేయుచున్నావు.

అపోస్తలులకార్యములు 3:25 ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు.

అపోస్తలులకార్యములు 7:5 ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను.

రోమీయులకు 11:28 సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులు గాని, యేర్పాటు విషయమైతే పితరులనుబట్టి ప్రియులై యున్నారు.