Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 19 వచనము 9

ద్వితియోపదేశాకాండము 11:22 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన మార్గములన్నిటిలోను నడుచుచు, ఆయనను హత్తుకొని, మీరు చేయవలెనని నేను మికాజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను.

ద్వితియోపదేశాకాండము 11:23 అప్పుడు యెహోవా మీ యెదుటనుండి ఈ సమస్త జనములను వెళ్లగొట్టును; మీరు మీకంటె బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు.

ద్వితియోపదేశాకాండము 11:24 మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును; అరణ్యము మొదలుకొని లెబానోనువరకును యూఫ్రటీసునది మొదలుకొని పడమటి సముద్రమువరకును మీ సరిహద్దు వ్యాపించును.

ద్వితియోపదేశాకాండము 11:25 ఏ మనుష్యుడును మీ యెదుట నిలువడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటిమీద మీ బెదురు మీభయము పుట్టించును.

ద్వితియోపదేశాకాండము 12:32 నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.

యెహోషువ 20:7 అప్పుడు వారు నఫ్తా లీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయి మీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిర్యతర్బాను ప్రతిష్ఠపరచిరి.

యెహోషువ 20:8 తూర్పుదిక్కున యొర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీ యుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్య ములోని బేసెరును, గాదీయుల గోత్రము లోనుండి గిలాదు లోని రామోతును, మనష్షీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించిరి.

నిర్గమకాండము 21:13 అయితే వాడు చంపవలెనని పొంచియుండకయే దైవికముగా వానిచేత ఆ హత్య జరిగినయెడల వాడు పారిపోగల యొక స్థలమును నీకు నిర్ణయించెదను.