Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 19 వచనము 20

ద్వితియోపదేశాకాండము 13:11 అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు.

ద్వితియోపదేశాకాండము 17:7 వాని చంపుటకు మొదట సాక్షులును తరువాత జనులందరును వానిమీద చేతులు వేయవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.

ద్వితియోపదేశాకాండము 17:13 అప్పుడు జనులందరు విని భయపడి మూర్ఖవర్తనము విడిచిపెట్టెదరు.

ద్వితియోపదేశాకాండము 21:21 అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్యనుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు.

సామెతలు 21:11 అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశమువలన తెలివినొందును.

రోమీయులకు 13:3 ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచికార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండకోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు.

రోమీయులకు 13:4 నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు.

1తిమోతి 5:20 ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము.

ద్వితియోపదేశాకాండము 19:19 అట్లు మీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరించుదురు.

యెహెజ్కేలు 14:11 వారు ఆలాగున తమకు కలుగజేసికొనిన దోషమునకు శిక్షనొందుదురు, ప్రవక్తయొద్ద విచారించువాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును, ఇదే యెహోవా వాక్కు.

ప్రకటన 2:23 దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.