Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 19 వచనము 21

ద్వితియోపదేశాకాండము 19:13 వాని కటాక్షింపకూడదు; నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలీయుల మధ్యనుండి నిర్దోషి ప్రాణవిషయమైన దోషమును పరిహరింపవలెను.

నిర్గమకాండము 21:23 హాని కలిగినయెడల నీవు ప్రాణమునకు ప్రాణము,

నిర్గమకాండము 21:24 కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు,

నిర్గమకాండము 21:25 వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను.

లేవీయకాండము 24:17 ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను.

లేవీయకాండము 24:18 జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను.

లేవీయకాండము 24:19 ఒకడు తన పొరుగువానికి కళంకము కలుగజేసినయెడల వాడు చేసినట్లు వానికి చేయవలెను.

లేవీయకాండము 24:20 విరుగగొట్టబడిన దాని విషయములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసినందున వానికి కళంకము కలుగజేయవలెను.

లేవీయకాండము 24:21 జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసినవానికి మరణశిక్ష విధింపవలెను.

మత్తయి 5:38 కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.

మత్తయి 5:39 నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడ త్రిప్పుము.

ఆదికాండము 45:20 ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామగ్రిని లక్ష్యపెట్టకుడని చెప్పుమనగా

నిర్గమకాండము 21:20 ఒకడు తన దాసుడైనను తన దాసియైనను చచ్చునట్లు కఱ్ఱతో కొట్టినయెడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును.

నిర్గమకాండము 21:24 కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు,

లేవీయకాండము 24:19 ఒకడు తన పొరుగువానికి కళంకము కలుగజేసినయెడల వాడు చేసినట్లు వానికి చేయవలెను.

లేవీయకాండము 24:20 విరుగగొట్టబడిన దాని విషయములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసినందున వానికి కళంకము కలుగజేయవలెను.

ద్వితియోపదేశాకాండము 7:16 మరియు నీ దేవుడైన యెహోవా నీ కప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయుదువు. నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏలయనగా అది నీకు ఉరియగును.

ద్వితియోపదేశాకాండము 25:12 నీ కన్ను కటాక్షింపకూడదు.