Logo

కీర్తనలు అధ్యాయము 35 వచనము 8

కీర్తనలు 35:4 నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడుచేయ నాలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురు గాక.

కీర్తనలు 35:5 యెహోవా దూత వారిని పారదోలునుగాక వారు గాలికి కొట్టుకొనిపోవు పొట్టువలె నుందురుగాక.

కీర్తనలు 35:6 యెహోవా దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటియై జారుడుగా నుండునుగాక.

కీర్తనలు 35:7 నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి.

కీర్తనలు 35:8 వానికి తెలియకుండ చేటు వానిమీదికి వచ్చునుగాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక వాడు ఆ చేటులోనే పడునుగాక.

కీర్తనలు 64:7 దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు.

కీర్తనలు 73:18 నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు

కీర్తనలు 73:19 క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.

కీర్తనలు 73:20 మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీకరింతువు.

సామెతలు 29:1 ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.

లూకా 21:34 మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.

1దెస్సలోనీకయులకు 5:3 లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు

కీర్తనలు 7:15 వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను.

కీర్తనలు 7:16 వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తిమీదనే పడును.

కీర్తనలు 57:6 నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము క్రుంగియున్నది. నా యెదుట గుంటత్రవ్వి దానిలో తామేపడిరి. (సెలా.)

కీర్తనలు 141:9 నా నిమిత్తము వారు ఒడ్డిన వలనుండి పాపము చేయువారి ఉచ్చులనుండి నన్ను తప్పించి కాపాడుము.

కీర్తనలు 141:10 నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురు గాక.

సామెతలు 5:22 దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును.

1సమూయేలు 18:17 సౌలు నా చెయ్యి వానిమీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వానిమీద పడును గాక అనుకొని దావీదూ, నా పెద్ద కుమార్తెయైన మేరబును నీకిత్తును; నీవు నా పట్ల యుద్ధశాలివై యుండి యెహోవా యుద్ధములను జరిగింపవలెననెను.

1సమూయేలు 31:2 సౌలును అతని కుమారులను తరుముచు, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అను సౌలుయొక్క కుమారులను హతము చేసిరి.

1సమూయేలు 31:3 యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులువేయువారి కంటబడి వారిచేత బహు గాయములనొందెను. అప్పుడు సౌలు

1సమూయేలు 31:4 సున్నతిలేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీకత్తి దూసి దానిచేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయముచేత ఆలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దానిమీద పడెను.

2సమూయేలు 17:2 నేను అతనిమీద పడి అతని బెదరించినయెడల అతనియొద్దనున్న జనులందరు పారిపోదురు; రాజును మాత్రము హతముచేసి జనులందరిని నీతట్టు త్రిప్పెదను;

2సమూయేలు 17:3 నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరు వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను పండ్రెండు వేలమందిని ఏర్పరచుకొనిపోయి యీ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా

2సమూయేలు 17:4 ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలువారి పెద్దలకందరికిని యుక్తముగా కనబడెను.

2సమూయేలు 17:23 అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరుగకపోవుట చూచి, గాడిదకు గంతకట్టి యెక్కి తన ఊరనున్న తన యింటికి పోయి తన యిల్లు చక్కబెట్టుకొని ఉరిపోసికొని చనిపోయెను; జనులు అతని తండ్రి సమాధియందు అతనిని పాతిపెట్టిరి.

2సమూయేలు 18:14 యోవాబు నీవు చేయువరకు నేను కాచుకొని యుందునా? అని చెప్పి మూడు బాణములు చేతపట్టుకొని పోయి మస్తకివృక్షమున వ్రేలాడుచు ఇంకను ప్రాణముతోనున్న అబ్షాలోముయొక్క గుండెకు గురిపెట్టి

2సమూయేలు 18:15 తన ఆయుధములను మోయువారు పదిమంది చుట్టు చుట్టుకొని యుండగా అబ్షాలోమును కొట్టి చంపెను.

ఎస్తేరు 7:10 కాగా హామాను మొర్దెకైకి సిద్ధముచేసిన ఉరి కొయ్యమీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను.

మత్తయి 27:3 అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణములు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి

మత్తయి 27:4 నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా

మత్తయి 27:5 అతడు ఆ వెండి నాణములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టుకొనెను.

సంఖ్యాకాండము 35:20 వాని కనుగొనినప్పుడు వాని చంపవలెను. ఒకడు చచ్చునట్లు వాని పగపట్టి పొడిచినను, లేక పొంచియుండి వానిమీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరమువలన చేతితో వాని కొట్టినను, కొట్టినవాడు నరహంతకుడు, నిశ్చయముగా వాని చంపవలెను.

ఎస్తేరు 7:9 రాజుముందర నుండు షండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలుకొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన యేబది మూరల యెత్తుగల ఉరికొయ్య హామాను ఇంటియొద్ద నాటబడి యున్నదనగా రాజు దానిమీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను.

యోబు 5:13 జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును కపటుల ఆలోచనను తలక్రిందుచేయును

యోబు 18:8 వారు వాగురలమీద నడచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును.

కీర్తనలు 9:15 తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది.

కీర్తనలు 35:15 నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి.

కీర్తనలు 37:15 వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును.

కీర్తనలు 142:3 నాలో నా ప్రాణము క్రుంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియును నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు.