Logo

కీర్తనలు అధ్యాయము 35 వచనము 21

కీర్తనలు 22:13 చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు

యెషయా 9:12 తూర్పున సిరియాయు పడమట ఫిలిష్తీయులును నోరుతెరచి ఇశ్రాయేలును మింగివేయవలెనని యున్నారు ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు.ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

లూకా 11:53 ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయనమీద నిండ పగబట్టి ఆయనమీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోటనుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి,

లూకా 11:54 వదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.

కీర్తనలు 40:15 నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురు గాక.

కీర్తనలు 54:7 ఆపదలన్నిటిలోనుండి ఆయన నన్ను విడిపించియున్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది.

కీర్తనలు 70:3 ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయ మొందుదురుగాక

ఆదికాండము 9:22 అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను.

యోబు 16:10 జనులు నామీద తమ నోరు తెరతురు నన్ను తిట్టి చెంపమీద కొట్టుదురు. వారు ఏకీభవించి నామీద గుంపు కూడుదురు

యోబు 30:11 ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను కావున వారు నాకు లోబడక కళ్లెము వదలించుకొందురు.

కీర్తనలు 10:3 దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు

కీర్తనలు 38:21 యెహోవా, నన్ను విడువకుము నా దేవా, నాకు దూరముగా నుండకుము.

కీర్తనలు 39:8 నా అతిక్రమములన్నిటినుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము.

యెషయా 57:4 మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా?

విలాపవాక్యములు 2:16 నీ శత్రువులందరు నిన్నుచూచి నోరుతెరచెదరు వారు ఎగతాళిచేసి పండ్లుకొరుకుచు దాని మింగివేసియున్నాము ఇదేగదా మనము కనిపెట్టిన దినము అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని యనుకొనెదరు.

యెహెజ్కేలు 26:2 నరపుత్రుడా, యెరూషలేమునుగూర్చి ఆహా జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నావశమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనుక