Logo

కీర్తనలు అధ్యాయము 35 వచనము 28

కీర్తనలు 34:1 నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.

కీర్తనలు 50:15 ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పరచెదవు.

కీర్తనలు 51:14 దేవా, నా రక్షణకర్తయగు దేవా రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతినిగూర్చి ఉత్సాహగానము చేయును.

కీర్తనలు 51:15 ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.

కీర్తనలు 71:24 వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును.

కీర్తనలు 104:33 నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను నేనున్నంతకాలము నా దేవుని కీర్తించెదను.

కీర్తనలు 104:34 ఆయననుగూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను.

కీర్తనలు 145:1 రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను

కీర్తనలు 145:2 అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.

కీర్తనలు 145:5 మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను

కీర్తనలు 145:21 శరీరులందరు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక.

కీర్తనలు 7:17 యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను.

కీర్తనలు 71:8 నీ కీర్తితోను నీ ప్రభావవర్ణనతోను దినమంతయు నా నోరు నిండియున్నది.

కీర్తనలు 71:15 నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు.

యాకోబు 3:9 దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.