కీర్తనలు 7:6 యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా.
కీర్తనలు 44:23 ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము.
కీర్తనలు 80:2 ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అనువారి యెదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింప రమ్ము.
యెషయా 51:9 యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగుకొమ్ము పూర్వపుకాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? మకరమును పొడిచినవాడవు నీవే గదా?
కీర్తనలు 89:26 నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొఱ్ఱపెట్టును.
కీర్తనలు 142:5 యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమిమీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని.
యోహాను 20:28 అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను.
ఆదికాండము 16:5 అప్పుడు శారయి నా ఉసురు నీకు తగులును; నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలిసికొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైనదాననైతిని; నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను
కీర్తనలు 3:7 యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవు నీవే.
కీర్తనలు 59:4 నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసికొనుటకై మేల్కొనుము.
కీర్తనలు 109:1 నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము
యెషయా 10:26 ఓరేబు బండయొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకధిపతియగు యెహోవా తన కొరడాలను వానిమీద ఆడించును. ఆయన దండము సముద్రమువరకు వచ్చును ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దానినెత్తును.
విలాపవాక్యములు 3:59 యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచియున్నావు నా వ్యాజ్యెము తీర్చుము.