Logo

కీర్తనలు అధ్యాయము 89 వచనము 20

1సమూయేలు 16:1 అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.

2సమూయేలు 7:8 కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుము సైన్యములకధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా గొఱ్ఱల కాపులోనున్న నిన్ను గొఱ్ఱలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించితిని.

2సమూయేలు 7:9 నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగానుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలము చేసి, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసియున్నాను.

2సమూయేలు 7:10 మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దానియందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనులమీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకయుండునట్లుగా చేసి

2సమూయేలు 7:11 నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా నేను నీకు సంతానము కలుగజేయుదును.

2సమూయేలు 7:12 నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.

2సమూయేలు 7:13 అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను;

2సమూయేలు 7:14 నేనతనికి తండ్రినైయుందును. అతడు నాకు కుమారుడైయుండును; అతడు పాపము చేసినయెడల నరుల దండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని

2సమూయేలు 7:15 నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను.

2సమూయేలు 7:16 నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను.

2సమూయేలు 7:17 తనకు కలిగిన దర్శనమంతటినిబట్టి యీ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పెను.

లూకా 1:70 తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణశృంగమును, అనగా

2పేతురు 1:21 ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.

2పేతురు 3:2 పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను.

మార్కు 1:24 వాడు నజరేయుడవగు యేసూ, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలువేసెను.

ప్రకటన 3:7 ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయలేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా

1సమూయేలు 16:18 చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా

యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

యిర్మియా 30:21 వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనువాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీసెదను; ఇదే యెహోవా వాక్కు.

కీర్తనలు 89:3 నేను ఏర్పరచుకొనినవానితో నిబంధన చేసియున్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను

1రాజులు 11:34 రాజ్యము వానిచేతిలోనుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసికొని అతని దినములన్నియు అతనిని అధికారిగా ఉండనిత్తును.

ఫిలిప్పీయులకు 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగినవాడై యుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

ఫిలిప్పీయులకు 2:7 మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

ఫిలిప్పీయులకు 2:8 మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

ఫిలిప్పీయులకు 2:9 అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని,

ఫిలిప్పీయులకు 2:10 భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,

ఫిలిప్పీయులకు 2:11 ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను.

హెబ్రీయులకు 2:9 దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించినవానిగా ఆయనను చూచుచున్నాము

హెబ్రీయులకు 2:10 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.

హెబ్రీయులకు 2:11 పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక

హెబ్రీయులకు 2:12 నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానముచేతును అనెను.

హెబ్రీయులకు 2:13 మరియు నేనాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.

హెబ్రీయులకు 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును,

హెబ్రీయులకు 2:15 జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

హెబ్రీయులకు 2:16 ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.

హెబ్రీయులకు 2:17 కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.

ఆదికాండము 22:13 అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుకతట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను

నిర్గమకాండము 28:12 అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజములమీద ఉంచవలెను అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన రెండు భుజములమీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును

సంఖ్యాకాండము 11:14 ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచినయెడల నన్ను చంపుము.

సంఖ్యాకాండము 12:6 వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసికొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడుకాడు.

సంఖ్యాకాండము 24:4 అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.

ద్వితియోపదేశాకాండము 1:12 నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను?

1సమూయేలు 13:14 యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొనియున్నాడు. నీకు ఆజ్ఞాపించినదాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనులమీద అతనిని అధిపతినిగా నియమించును.

1సమూయేలు 16:12 అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొనివచ్చెను. అతడు ఎఱ్ఱనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైనవాడునై యుండెను. అతడు రాగా నేనేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా

2సమూయేలు 3:9 యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చనియెడల

2సమూయేలు 3:18 నా సేవకుడైన దావీదుచేత నా జనులగు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలోనుండియు, వారి శత్రువులందరి చేతిలోనుండియు విమోచించెదనని యెహోవా దావీదునుగూర్చి సెలవిచ్చియున్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను.

2సమూయేలు 6:21 నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనులమీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను యేర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేనాలాగు చేసితిని; యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని.

1రాజులు 8:16 నేను ఇశ్రాయేలీయులగు నా జనులను ఐగుప్తులోనుండి రప్పించిన నాటనుండి నా నామము దానియందుండునట్లుగా ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇశ్రాయేలీయులగు నా జనులమీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చెను.

1దినవృత్తాంతములు 12:23 యెహోవా నోటిమాట ప్రకారము సౌలుయొక్క రాజ్యమును దావీదుతట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతనియొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క యెంతయనగా

1దినవృత్తాంతములు 17:17 దేవా, యిది నీ దృష్టికి స్వల్ప విషయమే; దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలమువరకు నీ సేవకుని సంతతినిగూర్చి సెలవిచ్చి, మనుష్యునితో మనుష్యుడు మాటలాడునట్లు దయ పాలించి నాతో మాటలాడి, నా సంతతి ఘనతజెందునని మాట యిచ్చియున్నావు.

2దినవృత్తాంతములు 6:6 ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీయులమీద అధిపతిగానుండుటకై దావీదును కోరుకొంటిని.

2దినవృత్తాంతములు 13:5 ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడును ఏలునట్లుగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతివారితోను భంగము కాజాలని1 నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలిసికొందురు గదా.

కీర్తనలు 60:1 దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదరగొట్టియున్నావు నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము.

కీర్తనలు 60:6 తన పరిశుద్ధతతోడని దేవుడు మాట యిచ్చియున్నాడు నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను.

కీర్తనలు 78:70 తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱల దొడ్లలోనుండి అతని పిలిపించెను.

కీర్తనలు 119:42 అప్పుడు నన్ను నిందించువారికి నేను ఉత్తరమీయగలను ఏలయనగా నీమాట నమ్ముకొనియున్నాను.

యెషయా 1:1 ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదానుగూర్చియు యెరూషలేమునుగూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము.

యెషయా 42:1 ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.

దానియేలు 2:44 ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.

హబక్కూకు 3:13 నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు దుష్టుల కుటుంబికులలో ప్రధానుడొకడుండకుండ వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు.(సెలా.)

మత్తయి 12:18 ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును.

మత్తయి 28:18 అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.

అపోస్తలులకార్యములు 2:27 నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు.

అపోస్తలులకార్యములు 2:30 అతని సమాధి నేటివరకు మనమధ్య నున్నది. అతడు ప్రవక్తయై యుండెను గనుక అతని గర్భఫలములోనుండి అతని సింహాసనముమీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టుపెట్టుకొనిన సంగతి అతడెరిగి

అపోస్తలులకార్యములు 2:33 కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించియున్నాడు.

అపోస్తలులకార్యములు 5:31 ఇశ్రాయేలునకు మారుమనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్త బలముచేత హెచ్చించియున్నాడు.

అపోస్తలులకార్యములు 7:46 అతడు దేవుని దయపొంది యాకోబు యొక్క దేవుని నివాసస్థలము కట్టగోరెను.

అపోస్తలులకార్యములు 13:22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.

అపోస్తలులకార్యములు 13:34 మరియు ఇక కుళ్లుపట్టకుండ ఆయనను మృతులలోనుండి లేపుటనుబట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను.

1పేతురు 2:6 ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.