Logo

కీర్తనలు అధ్యాయము 89 వచనము 44

యెహెజ్కేలు 30:21 నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజైన ఫరో బాహువును విరిచితిని, అది బాగవుటకు ఎవరును దానికి కట్టుకట్టరు, అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరును దానికి బద్దకట్టరు; కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా

యెహెజ్కేలు 30:22 నేను ఐగుప్తు రాజైన ఫరోకు విరోధినైయున్నాను, బాగుగా ఉన్నదానిని విరిగిపోయిన దానిని అతని రెండుచేతులను విరిచి, అతని చేతిలోనుండి ఖడ్గము జారిపడజేసెదను.

యెహెజ్కేలు 30:23 ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.

యెహెజ్కేలు 30:24 మరియు బబులోను రాజుయొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతని చేతికిచ్చెదను, ఫరోయొక్క చేతులను నేను విరిచినందున బబులోనురాజు చూచుచుండగా ఫరో చావుదెబ్బ తినినవాడై మూల్గులిడును.

యెహెజ్కేలు 30:25 బబులోను రాజుయొక్క చేతులను బలపరచి ఫరోచేతులను ఎత్తకుండచేసి, ఐగుప్తు దేశముమీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోను రాజు చేతికియ్యగా నేను యెహోవానై యున్నానని ఐగుప్తీయులు తెలిసికొందురు.

లేవీయకాండము 26:36 మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను; కొట్టుకొనిపోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుటనుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు; తరుమువాడు లేకయే పడెదరు.

లేవీయకాండము 26:37 తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకనిమీదనొకడు పడెదరు; మీ శత్రువులయెదుట మీరు నిలువలేకపోయెదరు.

సంఖ్యాకాండము 14:42 అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడుగనుక మీ శత్రువులయెదుట హతము చేయబడుదురు; మీరు సాగిపోకుడి.

సంఖ్యాకాండము 14:45 అప్పుడు ఆ కొండమీద నివాసముగానున్న అమాలేకీయులును కనానీయులును దిగివచ్చి వారిని కొట్టి హోర్మావరకు వారిని తరిమి హతముచేసిరి.

యెహోషువ 7:4 కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేలమంది అక్కడికి వెళ్లిరిగాని వారు హాయివారి యెదుట నిలువలేక పారిపోయిరి.

యెహోషువ 7:5 అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరు గురు మనుష్యులను హతము చేసిరి. మరియు తమగవినియొద్ద నుండి షేబారీమువరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను.

యెహోషువ 7:8 ప్రభువా కనికరించుము; ఇశ్రాయేలీయులు తమ శత్రువులయెదుట నిలువలేక వెనుకకు తిరిగి నందుకు నేనేమి చెప్పగలను?

యెహోషువ 7:9 కనానీయులును ఈ దేశ నివాసులందరును విని, మమ్మును చుట్టుకొని మా పేరు భూమిమీద ఉండకుండ తుడిచివేసినయెడల, ఘనమైన నీ నామమునుగూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా

యెహోషువ 7:10 యెహోవా యెహోషువతో ఇట్లనెనులెమ్ము, నీ వేల యిక్కడ ముఖము నేల మోపికొందువు?

యెహోషువ 7:11 ఇశ్రాయేలీయులు పాపము చేసియున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాని కొంత తీసికొని, దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొని యున్నారు.

యెహోషువ 7:12 కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులయెదుట నిలువలేక తమ శత్రువుల యెదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైనవారు మీ మధ్యనుండకుండ మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడైయుండను.

2దినవృత్తాంతములు 25:8 ఆలాగు పోవలెనని నీకున్నయెడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును; నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమేగదా అని ప్రకటింపగా