Logo

కీర్తనలు అధ్యాయము 89 వచనము 45

1సమూయేలు 4:21 దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలిసికొని ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు1 అను పేరు పెట్టెను.

1సమూయేలు 4:22 దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి చెరపట్టబడి పోయెనని ఆమె చెప్పెను.

1రాజులు 12:16 కాబట్టి ఇశ్రాయేలువారందరును రాజు తమ విన్నపమును వినలేదని తెలిసికొని రాజుకీలాగు ప్రత్యుత్తరమిచ్చిరి దావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీ మీ గుడారములకు పోవుడి; దావీదు సంతతివారలారా, మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారములకు వెళ్లిపోయిరి.

1రాజులు 12:17 అయితే యూదా పట్ణణములలోనున్న ఇశ్రాయేలువారిని రెహబాము ఏలెను.

1రాజులు 12:18 తరువాత రాజైన రెహబాము వెట్టిపని వారిమీద అధికారియైన అదోరామును పంపగా ఇశ్రాయేలువారందరును రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను, కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని తన రథముమీద త్వరగా ఎక్కెను.

1రాజులు 12:19 ఈ ప్రకారము ఇశ్రాయేలువారు నేటివరకు జరుగుచున్నట్లు దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసిరి.

1రాజులు 12:20 మరియు యరొబాము తిరిగివచ్చెనని ఇశ్రాయేలు వారందరు విని, సమాజముగా కూడి, అతని పిలువనంపించి ఇశ్రాయేలువారందరిమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి; యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతివారిని వెంబడించినవారెవరును లేకపోయిరి.

1రాజులు 14:25 రాజైన రెహబాముయొక్క అయిదవ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి

1రాజులు 14:26 యెహోవా మందిరపు ఖజనాలోని పదార్థములను, రాజనగరుయొక్క ఖజనాలోని పదార్థములను, ఎత్తికొనిపోయెను, అతడు సమస్తమును ఎత్తికొనిపోయెను; సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తికొనిపోయెను.

1రాజులు 14:27 రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి, రాజనగరు ద్వారపాలకులైన తన దేహసంరక్షకుల అధిపతుల వశము చేసెను.

1రాజులు 14:28 రాజు యెహోవా మందిరమునకు వెళ్లునప్పుడెల్ల రాజదేహ సంరక్షకులు వాటిని మోసికొనిపోయి అతడు తిరిగిరాగా వాటిని తమ గదిలో ఉంచిరి.

విలాపవాక్యములు 4:1 బంగారము ఎట్లు మందగిలినది? మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది? ప్రతి వీధిమొగను ప్రతిష్టితమైన రాళ్లు పారవేయబడియున్నవి.

విలాపవాక్యములు 4:2 మేలిమి బంగారముతో పోల్చదగిన సీయోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరిచేసిన మంటికుండలుగా ఎంచబడుచున్నారు?

2దెస్సలోనీకయులకు 2:3 మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు.

2దెస్సలోనీకయులకు 2:4 ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి.

2దెస్సలోనీకయులకు 2:5 నేనింకను మీయొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా?

2దెస్సలోనీకయులకు 2:6 కాగా వాడు తన సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించునది ఏదో అది మీరెరుగుదురు.

2దెస్సలోనీకయులకు 2:7 ధర్మవిరోధసంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసివేయబడువరకే అడ్డగించును.

2దెస్సలోనీకయులకు 2:8 అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి యూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.

2దెస్సలోనీకయులకు 2:9 నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచక క్రియలతోను, మహత్కార్యములతోను

2దెస్సలోనీకయులకు 2:10 దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి యుండును

కీర్తనలు 89:39 నీ సేవకుని నిబంధన నీకసహ్యమాయెను అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచియున్నావు.

దానియేలు 7:20 మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు, వాటి మధ్యనుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి, కన్నులును గర్వముగా మాటలాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ములకంటె బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని.

దానియేలు 7:21 ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచునదాయెను.

దానియేలు 7:22 ఆ మహా వృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చువరకు ఆలాగు జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యమునేలుదురను సంగతి నేను గ్రహించితిని.

దానియేలు 7:23 నేనడగినదానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెను ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోకమంతయు భక్షించును.

దానియేలు 7:24 ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పదిమంది రాజులను సూచించుచున్నవి; కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరియొక రాజుపుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును.

దానియేలు 7:25 ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.

యోబు 19:9 ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు తలమీదనుండి నా కిరీటమును తీసివేసియున్నాడు.

యెషయా 47:1 కన్యకయైన బబులోనూ, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము కల్దీయుల కుమారీ, సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము నీవు మృదువువనియైనను సుకుమారివనియైనను జనులు ఇకమీదట చెప్పరు.