Logo

కీర్తనలు అధ్యాయము 89 వచనము 39

కీర్తనలు 44:9 అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరచియున్నావు. మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు.

కీర్తనలు 44:10 శత్రువులయెదుట నిలువకుండ మమ్మును వెనుకకు పారిపోజేయుచున్నావు మమ్మును ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు.

కీర్తనలు 44:11 భోజనపదార్థముగా ఒకడు గొఱ్ఱలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టియున్నావు

కీర్తనలు 44:12 అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు

కీర్తనలు 44:13 మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసియున్నావు మా చుట్టు నున్నవారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచియున్నావు.

కీర్తనలు 44:14 అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు.

కీర్తనలు 44:15 నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా శత్రువులనుబట్టియు పగ తీర్చుకొనువారినిబట్టియు

కీర్తనలు 44:16 నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది.

కీర్తనలు 44:17 ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు.

కీర్తనలు 44:18 మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు.

కీర్తనలు 44:19 అయితే నక్కలున్నచోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారముచేత మమ్మును కప్పియున్నావు

కీర్తనలు 44:20 మా దేవుని నామమును మేము మరచియున్నయెడల అన్యదేవతలతట్టు మాచేతులు చాపియున్నయెడల

కీర్తనలు 44:21 హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా?

కీర్తనలు 44:22 నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము వధకు సిద్ధమైన గొఱ్ఱలమని మేము ఎంచబడుచున్నాము

కీర్తనలు 44:23 ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము.

కీర్తనలు 44:24 నీ ముఖమును నీ వేల మరుగుపరచియున్నావు? మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచియున్నావు?

కీర్తనలు 44:25 మా ప్రాణము నేలకు క్రుంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది.

కీర్తనలు 44:26 మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము.

కీర్తనలు 60:1 దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదరగొట్టియున్నావు నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము.

కీర్తనలు 60:10 దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు గదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మానియున్నావు గదా?

కీర్తనలు 77:7 ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా?

1దినవృత్తాంతములు 28:9 సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము,ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును.

యిర్మియా 12:1 యెహోవా, నేను నీతో వాదించునప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు; అయినను న్యాయము విధించుటనుగూర్చి నేను నీతో మాటలాడుదును; దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల? మహా విశ్వాసఘాతకులు సుఖింపనేల?

హోషేయ 9:17 వారు నా దేవుని మాటల నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు.

కీర్తనలు 78:59 దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహ్యించుకొనెను.

కీర్తనలు 106:40 కావున యెహోవా కోపము ఆయన ప్రజలమీద రగులుకొనెను ఆయన తనస్వాస్థ్యమందు అసహ్యపడెను.

ద్వితియోపదేశాకాండము 32:19 యెహోవా దానిని చూచెను. తన కూమారులమీదను కుమార్తెలమీదను క్రోధపడెను వారిని అసహ్యించుకొనెను.

విలాపవాక్యములు 2:7 ప్రభువు తన బలిపీఠము విడనాడెను తన పరిశుద్ధస్థలమునందు అసహ్యించుకొనెను దానినగరుల ప్రాకారములను శత్రువులచేతికి అప్పగించెను వారు నియామకకాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి.

జెకర్యా 11:8 ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించితిని; ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి.

కీర్తనలు 89:51 యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషిక్తుని నడతలమీద వారు మోపుచున్న నిందలు.

కీర్తనలు 84:9 దేవా, మా కేడెమా, దృష్టించుము నీవు అభిషేకించినవాని ముఖమును లక్షింపుము.

2సమూయేలు 1:21 గిల్బోవ పర్వతములారా మీమీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవును గాక. బలాఢ్యుల డాళ్లు అవమానముగ పారవేయబడెను. తైలముచేత అభిషేకింపబడని వారిదైనట్టు1సౌలు డాలును పారవేయబడెను.

2సమూయేలు 15:26 దానిని తన నివాసస్థానమును నాకు చూపించును; నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చినయెడల ఆయన చిత్తము, నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయెడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి

2దినవృత్తాంతములు 12:1 రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరును యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి.

2దినవృత్తాంతములు 12:2 వారు యెహోవా యెడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క అయిదవ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు వెయ్యిన్ని రెండువందల రథములతోను అరువదివేల గుఱ్ఱపు రౌతులతోను యెరూషలేముమీదికి వచ్చెను.

2దినవృత్తాంతములు 12:3 అతనితో కూడ ఐగుప్తునుండి వచ్చిన లూబీయులు సుక్కీయులు కూషీయులు అనువారు లెక్కకు మించియుండిరి.

2దినవృత్తాంతములు 12:4 అతడు యూదాకు సమీపమైన ప్రాకార పురములను పట్టుకొని యెరూషలేమువరకు రాగా

2దినవృత్తాంతములు 12:5 ప్రవక్తయైన షెమయా రెహబామునొద్దకును, షీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతులయొద్దకును వచ్చి మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకుచేతిలో పడనిచ్చియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను.

2దినవృత్తాంతములు 12:6 అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులును రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి.

2దినవృత్తాంతములు 12:7 వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనముచేయక, షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేముమీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసెదను.

2దినవృత్తాంతములు 12:8 అయితే నన్ను సేవించుటకును, భూరాజులకు దాసులైయుండుటకును ఎంత భేదమున్నదో వారు తెలిసికొనునట్లు వారు అతనికి దాసులగుదురు.

2దినవృత్తాంతములు 12:9 ఐగుప్తురాజైన షీషకు యెరూషలేముమీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటిని రాజనగరులోని బొక్కసములన్నిటిని దోచుకొని, సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసికొనిపోయెను.

2దినవృత్తాంతములు 12:10 వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరుయొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను.

2దినవృత్తాంతములు 12:11 రాజు యెహోవా మందిరములోనికి ప్రవేశించినప్పుడెల్ల నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరల గదిలో ఉంచుచు వచ్చిరి.

2దినవృత్తాంతములు 12:12 అతడు తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలముచేయక, యూదావారు కొంతమట్టుకు మంచితనము ననుసరించుట చూచి తన కోపము అతనిమీదనుండి త్రిప్పుకొనెను.

విలాపవాక్యములు 4:20 మాకు నాసికారంధ్రముల ఊపిరివంటివాడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను.

జెకర్యా 13:7 ఖడ్గమా, నా గొఱ్ఱల కాపరి మీదను నా సహకారి మీదను పడుము; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు గొఱ్ఱలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును; ఇదే యెహోవా వాక్కు.

లేవీయకాండము 26:30 నేను మీ యున్నతస్థలములను పాడుచేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను.

1రాజులు 11:39 వారు చేసిన క్రియలనుబట్టి నేను దావీదు సంతతివారిని బాధ పరచుదును గాని నిత్యము బాధింపను.

2రాజులు 21:14 మరియు నా స్వాస్థ్యములో శేషించినవారిని నేను త్రోసివేసి వారి శత్రువులచేతికి వారిని అప్పగించెదను.

యోబు 1:21 నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగివెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొనిపోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.

కీర్తనలు 55:20 తమతో సమాధానముగా నున్నవారికి వారు బలాత్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు.

కీర్తనలు 78:62 తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యముమీద ఆగ్రహించెను

కీర్తనలు 102:23 నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నాబలము క్రుంగజేసెను నా దినములు కొద్దిపరచెను.

కీర్తనలు 132:10 నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై యుండకుము.

యెషయా 49:14 అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టియున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది.

యిర్మియా 14:19 నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సీయోను నీకు అసహ్యమాయెనా? మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేల మమ్మును కొట్టితివి? మేము సమాధానముకొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేదియు కనబడుటలేదు; చికిత్స కలుగు కాలముకొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలియున్నది.

యెహెజ్కేలు 17:24 దాని కొమ్మల నీడను అవి దాగును; మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చనిచెట్టు ఎండిపోవునట్లును ఎండినచెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమియందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాని నెరవేర్చెదను.

యెహెజ్కేలు 21:10 అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టియున్నది, తళతళలాడునట్లు అది మెరుగుపెట్టియున్నది; ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటిని తృణీకరించునది అని చెప్పి మనము సంతోషించెదమా?