క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి
01 యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే.
02 మీరు వేకువనే లేచి చాల రాత్రియైన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు.
03 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే
04 యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు.
05 వారితో తన అంబులపొది నింపుకొనినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు.