Logo

కీర్తనలు అధ్యాయము 1 వచనము 4

కీర్తనలు 35:5 యెహోవా దూత వారిని పారదోలునుగాక వారు గాలికి కొట్టుకొనిపోవు పొట్టువలె నుందురుగాక.

యోబు 21:18 వారు తుపాను ఎదుట కొట్టుకొనిపోవు చెత్తవలెను గాలి యెగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా.

యెషయా 17:13 జనములు విస్తారజలముల ఘోషవలె ఘోషించును ఆయన వారిని బెదరించును వారు దూరముగా పారిపోవుదురు కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు.

యెషయా 29:5 నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుకరేణువులంత విస్తారముగా నుండును బాధించువారి సమూహము ఎగిరిపోవు పొట్టువలె నుండును హఠాత్తుగా ఒక్క నిమిషములోనే యిది సంభవించును.

హోషేయ 13:3 కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘమువలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలె నుందురు; కళ్లములోనుండి గాలి యెగురగొట్టు పొట్టు వలెను, కిటకీలోగుండ పోవు పొగవలె నుందురు.

మత్తయి 3:12 ఆయన చేట ఆయనచేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.

యోబు 30:22 గాలిచేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు తుపానుచేత నన్ను హరించివేయుచున్నావు

కీర్తనలు 37:38 భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము

కీర్తనలు 92:9 నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు చెడుపనులు చేయువారందరు చెదరిపోవుదురు.

కీర్తనలు 104:35 పాపులు భూమిమీదనుండి లయమగుదురు గాక భక్తిహీనులు ఇక నుండకపోదురు గాక నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము యెహోవాను స్తుతించుడి.

యెషయా 41:16 నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవానుబట్టి సంతోషించుదువు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిబట్టి అతిశయపడుదువు.

యెషయా 57:13 నీవు మొఱ్ఱపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా? ఒకడు ఊపిరి విడిచినమాత్రమున అవియన్నియు కొట్టుకొనిపోవును నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు.

యెషయా 64:6 మేమందరము అపవిత్రులవంటి వారమైతివిు మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతివిు గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను

యిర్మియా 8:13 ద్రాక్షచెట్టున ఫలములు లేకుండునట్లును, అంజూరపుచెట్టున అంజూరపు పండ్లు లేకుండునట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను; వారిమీదికి వచ్చువారిని నేనాలాగున పంపుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.

యిర్మియా 13:24 కాబట్టి అడవిగాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను.

యిర్మియా 15:7 దేశద్వారములో నేను వారిని చేటతో తూర్పారపట్టుచున్నాను, నా జనులు తమ మార్గములను విడిచి నాయొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయుచున్నాను.

యిర్మియా 17:6 వాడు ఎడారిలోని అరుహావృక్షమువలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును.

దానియేలు 2:35 అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను.

హోషేయ 13:15 నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందును. అయితే తూర్పుగాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములోనుండి లేచును; అది రాగా అతని నీటిబుగ్గలు ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటిని శత్రువు కొల్లపెట్టును.

జెఫన్యా 2:2 విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీమీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి.

మార్కు 4:6 సూర్యుడు ఉదయింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను.

లూకా 3:17 ఆయన చేట ఆయన చేతిలో నున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి, తన కొట్టులో గోధుమలు పోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను.

1పేతురు 4:18 మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు?