Logo

కీర్తనలు అధ్యాయము 12 వచనము 8

సామెతలు 29:12 అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్థులందరు దుష్టులుగా నుందురు

హోషేయ 5:11 ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతినిబట్టి ప్రవర్తింప గోరువారు; వారికధిక శ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింస నొందుదురు బాధింపబడుదురు.

మీకా 6:16 ఏలయనగా మీరు ఒమీ నియమించిన కట్టడల నాచరించుచు, అహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటి ననుసరించుచు వారి యోచనలనుబట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతిపుట్టించు జనులుగాను పట్టణనివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోవుచున్నాను.

న్యాయాధిపతులు 9:18 అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలె కును రాజుగా నియమించుకొనిన విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించినయెడల

న్యాయాధిపతులు 9:19 నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని యింటివారియెడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించినయెడల, అబీమెలెకునందు సంతోషించుడి అతడు మీ యందు సంతోషించునుగాక.

న్యాయాధిపతులు 9:20 లేనియెడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెమువారిని మిల్లో యింటి వారిని కాల్చివేయునుగాక, షెకె మువారిలోనుండియు మిల్లో యింటినుండియు అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి

న్యాయాధిపతులు 9:21 తన సహోదరుడైన అబీ మెలెకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్లి అక్కడ నివసించెను.

న్యాయాధిపతులు 9:22 అబీమెలెకు మూడు సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికయై యుండెను.

న్యాయాధిపతులు 9:23 అప్పుడు యెరుబ్బయలు డెబ్బదిమంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకను వారి సహోదరుని మీదికిని,

న్యాయాధిపతులు 9:24 అతడు తన సహోదరులను చంపునట్లు అతనిచేతులను బలపరచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్యవారి మీద వచ్చునట్లును, దేవుడు అబీమెలెకున కును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచించిరి.

న్యాయాధిపతులు 9:25 ఎట్లనగా షెకెము యజ మానులు కొండ శిఖరములమీద అతని కొరకు మాటు గాండ్లను ఉంచి, ఆ మార్గమున తమకు సమీపించినవారి నందరిని దోచుకొనిరి; అది అబీమెలెకునకు తెలుపబడెను.

న్యాయాధిపతులు 9:26 ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతని ఆశ్ర యించిరి.

న్యాయాధిపతులు 9:27 వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా

న్యాయాధిపతులు 9:28 ఎబెదు కుమారుడైన గాలు ఇట్లనెను అబీమెలెకు ఏపాటివాడు? షెకెము ఏపాటివాడు? మనము అతనికెందుకు దాసులము కావలెను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబులు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రియైన హమోరు వారికి దాసులమగుదము గాని మనము అతని కెందుకు దాసులము కావలెను?

న్యాయాధిపతులు 9:29 ఈ జనము నాచేతిలో ఉండినయెడల ఆహా నేను అబీమెలెకును తొలగింతును గదా అనెను. తరువాత అతడు అబీమెలెకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను.

న్యాయాధిపతులు 9:30 ఆ పట్టణ ప్రధానియైన జెబులు ఎబెదు కుమారుడైన గాలుమాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను.

న్యాయాధిపతులు 9:31 అప్పుడతడు అబీమెలెకు నొద్దకు రహస్యముగా దూతలను పంపిఇదిగో ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును షెకెముకు వచ్చి యున్నారు, వారు నీమీదికి ఈ పట్టణమును రేపు చున్నారు.

న్యాయాధిపతులు 9:32 కావున రాత్రి నీవును నీతోనున్న జనులును లేచి పొలములో మాటుగా నుండుడి,

న్యాయాధిపతులు 9:33 ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణముమీద పడ వలెను. అప్పుడు అతడును అతనితోనున్న జనులును నీయొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారియెడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేసెను.

న్యాయాధిపతులు 9:34 అబీమెలెకును అతనితోనున్న జనులందరును రాత్రివేళ లేచి నాలుగు గుంపులై షెకెముమీద పడుటకు పొంచి యుండిరి.

న్యాయాధిపతులు 9:35 ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్ట ణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితో నున్న జనులును పొంచియుండుట చాలించి లేచిరి.

న్యాయాధిపతులు 9:36 గాలు ఆ జనులను చూచి జెబులుతోఇదిగో జనులు కొండశిఖరములమీదనుండి దిగివచ్చుచున్నారనగా, జెబులుకొండల చాయలు మనుష్యులను పోలి నీకు కన బడుచున్నవని అతనితో చెప్పెను.

న్యాయాధిపతులు 9:37 గాలుచూడుము, దేశపు ఎత్తయినప్థల మునుండి జనులు దిగి వచ్చుచున్నారు; ఒక దండు శకునగాండ్ల మస్తకివృక్షపు త్రోవను వచ్చు చున్నదనెను.

న్యాయాధిపతులు 9:38 జెబులు అతనితో ఆహాహా మనము అతని సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడనిన నీమాట యేమా యెను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయుడనగా

న్యాయాధిపతులు 9:39 గాలు షెకెము యజ మానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను.

న్యాయాధిపతులు 9:40 అబీమెలెకు అతని తరుమగా అతడు అతని యెదుట నిలువలేక పారిపోయెను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి.

న్యాయాధిపతులు 9:41 అప్పుడు అబీ మెలెకు అరూమాలో దిగెను, గాలును అతని బంధువులును షెకెములో నివసింపకుండ జెబులు వారిని తోలివేసెను.

న్యాయాధిపతులు 9:42 మరునాడు జనులు పొలములలోనికి బయలువెళ్లిరి.

న్యాయాధిపతులు 9:43 అది అబీమెలెకునకు తెలియబడగా అతడు తన జనులను తీసికొని మూడు తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి; అప్పుడతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారిమీద పడి వారిని హతముచేసెను.

న్యాయాధిపతులు 9:44 అబీమెలెకును అతనితో నున్న తెగలును ఇంకసాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా రెండు తెగలు పరుగెత్తి పొలముల లోనున్న వారందరి మీదపడి వారిని హతముచేసిరి.

న్యాయాధిపతులు 9:45 ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధముచేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను.

న్యాయాధిపతులు 9:46 షెకెము గోపుర యజమానులందరు ఆ వార్త విని ఏల్‌ బెరీతు గుడియొక్క కోటలోనికి చొరబడిరి.

న్యాయాధిపతులు 9:47 షెకెము గోపుర యజమానులందరు కూడియున్న సంగతి అబీ మెలెకునకు తెలుపబడినప్పుడు

న్యాయాధిపతులు 9:48 అబీమెలెకును అతనితో నున్న జనులందరును సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలినిచేత పట్టుకొని చెట్లనుండి పెద్ద కొమ్మను నరికి యెత్తి భుజముమీద పెట్టుకొనినేను దేనిచేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను.

న్యాయాధిపతులు 9:49 అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటివలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు, అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యిమంది చచ్చిరి.

న్యాయాధిపతులు 9:50 తరువాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసునొద్ద దిగి దాని పట్టుకొనెను.

న్యాయాధిపతులు 9:51 ఆ పట్టణమునడుమ ఒక బల మైన గోపురముండగా స్త్రీ పురుషులును పట్టణపు యజ మానులును అక్కడికి పారిపోయి తలుపులు వేసికొని గోపుర శిఖరము మీదికెక్కిరి.

న్యాయాధిపతులు 9:52 అబీమెలెకు ఆ గోపురము నొద్దకు వచ్చి దానిమీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దాని కాల్చుటకు గోపురద్వారమునొద్దకు రాగా

న్యాయాధిపతులు 9:53 ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను.

న్యాయాధిపతులు 9:54 అప్పుడతడు తన ఆయుధములను మోయుబంటును త్వరగా పిలిచిఒక స్త్రీ అతని చంపెనని నన్నుగూర్చి యెవరును అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడువగా అతడు చచ్చెను.

న్యాయాధిపతులు 9:55 అబీమెలెకు చనిపోయెనని ఇశ్రాయేలీయులు తెలిసికొనినప్పుడు ఎవరిచోటికి వారు పోయిరి.

న్యాయాధిపతులు 9:56 అట్లు అబీమెలెకు తన డెబ్బదిమంది సహోదరులను చంపుటవలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతనిమీదికి రప్పించెను.

న్యాయాధిపతులు 9:57 షెకెమువారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలలమీదికి మరల రాజే సెను; యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారిమీదికి వచ్చెను.

1సమూయేలు 18:17 సౌలు నా చెయ్యి వానిమీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వానిమీద పడును గాక అనుకొని దావీదూ, నా పెద్ద కుమార్తెయైన మేరబును నీకిత్తును; నీవు నా పట్ల యుద్ధశాలివై యుండి యెహోవా యుద్ధములను జరిగింపవలెననెను.

1సమూయేలు 18:18 అందుకు దావీదు రాజునకు అల్లుడనగుటకు నేనెంతటివాడను? నా స్థితియైనను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏపాటివని సౌలుతో అనెను.

ఎస్తేరు 3:6 మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని యెంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలిసికొని, అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటనుండు మొర్దెకై స్వజనులగు యూదులనందరిని సంహరించుటకు ఆలోచించెను.

ఎస్తేరు 3:7 రాజైన అహష్వేరోషు యొక్క యేలుబడియందు పండ్రెండవ సంవత్సరమున నీసాను మాసమున, అనగా, ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు, అనగా చీటిని దినదినమునకును నెలనెలకును అదారు అను పండ్రెండవ నెలవరకు వేయుచు వచ్చిరి.

ఎస్తేరు 3:8 అంతట హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటియందుండు జనులలో ఒక జాతివారు చెదరియున్నారు; వారి విధులు సకలజనుల విధులకు వేరుగా ఉన్నవి; వారు రాజుయొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు; కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు.

ఎస్తేరు 3:9 రాజునకు సమ్మతియైతే వారు హతము చేయబడునట్లును, నేను ఆ పనిచేయువారికి ఇరువదివేల మణుగుల వెండిని రాజుయొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును, చట్టము పుట్టించుమనగా

ఎస్తేరు 3:10 రాజు తనచేతి ఉంగరము తీసి దానిని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామానున కిచ్చి

ఎస్తేరు 3:11 ఆ వెండి నీ కియ్యబడియున్నది; నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి యున్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు.

ఎస్తేరు 3:12 మొదటి నెల పదమూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆ యా సంస్థానములమీద నుంచబడిన రాజుయొక్క అధిపతులకును అధికారులకును, ఆ యా సంస్థానములలోని జనములమీద నుంచబడిన అధిపతులకును అధికారులకును, వారి వారి లిపినిబట్టియు, ఆ యా జనముల భాషనుబట్టియు, రాజైన అహష్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్రచేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరముచేత ముద్రింపబడెను.

ఎస్తేరు 3:13 అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమందు యౌవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరిని ఒక్కదినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారిచేత రాజ్య సంస్థానములన్నిటికిని పంపబడెను.

ఎస్తేరు 3:14 మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను.

ఎస్తేరు 3:15 అంచెవారు రాజాజ్ఞచేత త్వరపెట్టబడి బయలువెళ్లిరి. ఆ యాజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను, దాని విని షూషను పట్టణము కలతపడెను. అంతట రాజును హామానును విందుకు కూర్చుండిరి.

యెషయా 32:4 చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును.

యెషయా 32:5 మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు కపటి ఉదారుడనబడడు.

యెషయా 32:6 మూఢులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యెహోవానుగూర్చి కానిమాటలాడుచు ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు దప్పిగొనినవారికి పానీయము లేకుండ చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు.

మార్కు 14:63 ప్రధానయాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకు ఇక సాక్షులతో పనియేమి?

మార్కు 14:64 ఈ దేవదూషణ మీరు విన్నారు కారా; మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరు మరణమునకు పాత్రుడని ఆయనమీద నేరస్థాపన చేసిరి.

మార్కు 14:65 కొందరు ఆయనమీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుకు వేసి, ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులును ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి.

యోబు 30:8 వారు మోటువారికిని పేరు ప్రతిష్ఠతలు లేనివారికిని పుట్టినవారు వారు దేశములోనుండి తరుమబడినవారు.

దానియేలు 11:21 అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును; అతనికి రాజ్యఘనత నియ్యరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి యిచ్చకపు మాటలచేత రాజ్యమును అపహరించును.

1రాజులు 18:10 నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా యేలినవాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్యమొకటైనను లేదు; అతడు ఇక్కడ లేడనియు, అతని చూడలేదనియు, వారు ఆ యా జనములచేతను రాజ్యములచేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి.

2రాజులు 11:3 అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడ దాచబడియుండెను.

2రాజులు 21:9 ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా లయముచేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనష్షే వారిని రేపెను.

2దినవృత్తాంతములు 22:12 ఆరు సంవత్సరములు అతడు వారితోకూడ దేవుని మందిరములో దాచబడియుండెను; ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను.

ఎస్తేరు 3:1 ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరచి వాని హెచ్చించి, వాని పీఠమును తన దగ్గర నున్న అధిపతులందరికంటె ఎత్తుగా నుంచెను.

యోబు 22:8 బాహుబలముగల మనుష్యునికే భూమి ప్రాప్తించును ఘనుడని యెంచబడినవాడు దానిలో నివసించును.

యోబు 34:30 భక్తిహీనులు రాజ్యపరిపాలన చేయకుండునట్లు వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు

సామెతలు 26:1 ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు.

ప్రసంగి 10:6 ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు ఘనులు క్రింద కూర్చుండుటయు

యిర్మియా 26:22 అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను;

దానియేలు 4:17 ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియై యుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛయించునో వారికనుగ్రహించుననియు, ఆ యా రాజ్యముపైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరుగును.