Logo

కీర్తనలు అధ్యాయము 29 వచనము 10

కీర్తనలు 29:3 యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు. మహాజలములమీద యెహోవా సంచరించుచున్నాడు.

కీర్తనలు 65:7 ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు.

కీర్తనలు 104:6 దానిమీద అగాధజలములను నీవు వస్త్రమువలె కప్పితివి. కొండలకుపైగా నీళ్లు నిలిచెను.

కీర్తనలు 104:7 నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను.

కీర్తనలు 104:8 నీవు వాటికి నియమించినచోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను.

కీర్తనలు 104:9 అవి మరలివచ్చి భూమిని కప్పకయుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి.

ఆదికాండము 6:17 ఇదిగో నేనే జీవవాయువుగల సమస్త శరీరులను ఆకాశముక్రింద నుండకుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును;

ఆదికాండము 8:1 దేవుడు నోవహును అతనితోకూడ ఓడలో నున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.

ఆదికాండము 8:2 అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను; ఆకాశమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను.

యోబు 38:8 సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు?

యోబు 38:9 నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా?

యోబు 38:10 దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు

యోబు 38:11 నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?

యోబు 38:25 నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును

మార్కు 4:41 వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.

కీర్తనలు 2:6 నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను

కీర్తనలు 2:7 కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను.

కీర్తనలు 2:8 నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.

కీర్తనలు 2:9 ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు

కీర్తనలు 10:16 యెహోవా నిరంతరము రాజైయున్నాడు ఆయన దేశములోనుండి అన్యజనులు నశించిపోయిరి.

కీర్తనలు 93:1 యెహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యెహోవా బలముధరించి బలముతో నడుము కట్టుకొనియున్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది.

కీర్తనలు 99:1 యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును ఆయన కెరూబులమీద ఆసీనుడైయున్నాడు భూమి కదలును.

దానియేలు 2:44 ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.

మత్తయి 6:13 మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.

1తిమోతి 1:17 సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్‌.

నిర్గమకాండము 15:18 నీచేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువపెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు.

యెహోషువ 3:16 పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్ర మునకు పారునవి బొత్తిగా ఆపబడెను.

యోబు 26:12 తన బలమువలన ఆయన సముద్రమును రేపును తన వివేకమువలన రాహాబును పగులగొట్టును.

కీర్తనలు 77:19 నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.

కీర్తనలు 89:9 సముద్రపు పొంగు నణచువాడవు నీవే దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు.

యెషయా 40:22 ఆయన భూమండలముమీద ఆసీనుడైయున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను.

విలాపవాక్యములు 5:19 యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవైయుందువు నీ సింహాసనము తరతరములుండును.

దానియేలు 6:26 నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును.

మార్కు 4:39 అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను.

యోహాను 6:19 వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి;

హెబ్రీయులకు 1:11 ఆకాశములు కూడ నీచేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును