Logo

కీర్తనలు అధ్యాయము 32 వచనము 3

ఆదికాండము 3:8 చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్లమధ్యను దాగుకొనగా

ఆదికాండము 3:9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను.

ఆదికాండము 3:10 అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను.

ఆదికాండము 3:11 అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను.

ఆదికాండము 3:12 అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిననెను.

ఆదికాండము 3:13 అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను.

ఆదికాండము 3:14 అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియు మన్ను తిందువు

ఆదికాండము 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను.

ఆదికాండము 3:16 ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.

ఆదికాండము 3:17 ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;

ఆదికాండము 3:18 అది ముండ్లతుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు;

ఆదికాండము 3:19 నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.

1సమూయేలు 31:13 వారి శల్యములను తీసి యాబేషులోని పిచులవృక్షము క్రింద పాతిపెట్టి యేడుదినములు ఉపవాసముండిరి.

2సమూయేలు 11:27 అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్యయయి అతనికొక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.

2సమూయేలు 12:1 కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను; అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి.

2సమూయేలు 12:2 ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొఱ్ఱలును గొడ్లును కలిగియుండెను.

2సమూయేలు 12:3 అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన యొక చిన్న ఆడు గొఱ్ఱపిల్ల తప్ప ఏమియు లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వానియొద్దను వాని బిడ్డలయొద్దను ఉండి పెరిగి వాని చేతిముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తెవలె ఉండెను.

2సమూయేలు 12:4 అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతునియొద్దకు వచ్చెను. అతడు తనయొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొఱ్ఱలలోగాని గొడ్లలోగాని దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రుని గొఱ్ఱపిల్లను పట్టుకొని, తనయొద్దకు వచ్చినవానికి ఆయత్తము చేసెను.

2సమూయేలు 12:5 దావీదు ఈ మాట విని ఆ మనుష్యునిమీద బహుగా కోపించు కొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు.

2సమూయేలు 12:6 వాడు కనికరము లేక యీ కార్యము చేసెను గనుక ఆ గొఱ్ఱపిల్లకు ప్రతిగా నాలుగు గొఱ్ఱపిల్లల నియ్యవలెనని నాతానుతో అనెను.

2సమూయేలు 12:7 నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులమీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకముచేసి సౌలుచేతిలోనుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకనుగ్రహించి

2సమూయేలు 12:8 నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదావారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును.

2సమూయేలు 12:9 నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్యయగునట్లుగా నీవు పట్టుకొనియున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా?

2సమూయేలు 12:10 నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యయగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును.

2సమూయేలు 12:11 నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవాని కప్పగించెదను.

2సమూయేలు 12:12 పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను.

2సమూయేలు 21:12 కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారియొద్దనుండి తెప్పించెను. ఫిలిష్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా యాబేష్గిలాదు వారు వారి యెముకలను అచ్చటనుండి దొంగిలి తెచ్చియుండిరి.

2సమూయేలు 21:13 కావున దావీదు వారియొద్దనుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను, రాజాజ్ఞనుబట్టి ఉరితీయబడినవారి యెముకలను జనులు సమకూర్చిరి.

2సమూయేలు 21:14 సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధియందు పాతిపెట్టిరి. రాజు ఈలాగు చేసిన తరువాత దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడంగీకరించెను.

సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.

యెషయా 57:17 వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి.

యిర్మియా 31:18 నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పినయెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను.

యిర్మియా 31:19 నేను తిరిగిన తరువాత పశ్చాత్తాప పడితిని, నేను సంగతి తెలిసికొని తొడ చరుచుకొంటిని, నా బాల్య కాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడితిని.

లూకా 15:15 వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను.

లూకా 15:16 వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అశపడెను గాని యెవడును వానికేమియు ఇయ్యలేదు.

కీర్తనలు 6:2 యెహోవా, నేను కృశించియున్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్ను బాగుచేయుము

కీర్తనలు 31:9 యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము విచారమువలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి.

కీర్తనలు 31:10 నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించుచున్నవి నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా యెముకలు క్షీణించుచున్నవి.

కీర్తనలు 38:3 నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు.

కీర్తనలు 51:8 ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన యెముకలు హర్షించును.

కీర్తనలు 102:3 పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలిపోయియున్నవి.

కీర్తనలు 102:4 ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడిపోయియున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవుచున్నాను.

కీర్తనలు 102:5 నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహమునకు అంటుకొనిపోయినవి.

యోబు 30:17 రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడునట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు.

యోబు 30:30 నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది కాకవలన నా యెముకలు కాగిపోయెను. నా స్వరమండలము దుఃఖస్వరము నిచ్చుచున్నది నా పిల్లనగ్రోవి రోదనశబ్దము ఎత్తుచున్నది.

విలాపవాక్యములు 1:3 యూదా బాధనొంది దాసురాలై చెరలోనికి పోయియున్నది అన్యజనులలో నివసించుచున్నది విశ్రాంతినొందకపోయెను దానితరుమువారందరు ఇరుకుచోట్ల దాని కలిసికొందురు. నియామకకూటములకు ఎవరును రారుగనుక

విలాపవాక్యములు 3:4 ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు. నా యెముకలను విరుగగొట్టుచున్నాడు

కీర్తనలు 22:1 నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా నున్నావు?

కీర్తనలు 38:8 నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను

యోబు 3:24 భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి.

యెషయా 51:20 యెహోవా క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోను వారు నిండియున్నారు.

యెషయా 59:11 మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది

విలాపవాక్యములు 3:8 నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొనియున్నాడు.

హోషేయ 7:14 హృదయ పూర్వకముగా నన్ను బతిమాలుకొనక శయ్యలమీద పరుండి కేకలు వేయుదురు; నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలెనని వారు గుంపులు కూడుదురు.

లేవీయకాండము 26:39 మీలో మిగిలినవారు మీ శత్రువుల దేశములలో తమ దోషములనుబట్టి క్షీణించిపోయెదరు. మరియు వారు తమమీదికి వచ్చిన తమ తండ్రుల దోషములనుబట్టి క్షీణించిపోయెదరు.

2సమూయేలు 12:13 నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.

1రాజులు 8:38 ఇశ్రాయేలీయులగు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలిసికొనును గదా; ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసినయెడల

1దినవృత్తాంతములు 4:10 యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను.

2దినవృత్తాంతములు 33:13 ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను.

యోబు 2:5 ఇంకొకసారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను.

యోబు 10:1 నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినది నేను అడ్డులేకుండ అంగలార్చెదను నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను

యోబు 16:16 నాచేత బలాత్కారము జరుగకపోయినను నా ప్రార్థన యథార్థముగా నుండినను

యోబు 19:20 నా యెముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొనియున్నవి దంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడియున్నది

యోబు 20:14 అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారిలోపట నాగుపాముల విషమగును.

యోబు 33:21 వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన యెముకలు పైకి పొడుచుకొని వచ్చును

కీర్తనలు 6:7 విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి.

కీర్తనలు 22:15 నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొనియున్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసియున్నావు.

కీర్తనలు 35:10 అప్పుడు యెహోవా నీవంటివాడెవడు? మించిన బలముగలవారి చేతినుండి దీనులను దోచుకొనువారి చేతినుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా యెముకలన్నియు చెప్పుకొనును.

కీర్తనలు 38:5 నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసనగలవై స్రవించుచున్నవి.

కీర్తనలు 55:2 నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము.

కీర్తనలు 102:5 నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహమునకు అంటుకొనిపోయినవి.

కీర్తనలు 109:24 ఉపవాసముచేత నా మోకాళ్లు బలహీనమాయెను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను.

కీర్తనలు 116:3 మరణబంధములు నన్ను చుట్టుకొనియుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.

సామెతలు 17:22 సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.

సామెతలు 18:14 నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు?

మత్తయి 5:4 దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.

లూకా 15:18 నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి--తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని;

లూకా 22:32 నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.

అపోస్తలులకార్యములు 9:11 అతడు ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు

రోమీయులకు 7:24 అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?

1కొరిందీయులకు 11:31 అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందకపోదుము.

యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.