Logo

కీర్తనలు అధ్యాయము 35 వచనము 16

1సమూయేలు 20:24 కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను; అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయ కూర్చుండగా

1సమూయేలు 20:25 మునుపటివలెనే రాజు గోడదగ్గర నున్న స్థలమందు తన ఆసనముమీద కూర్చునియుండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలునొద్ద కూర్చుండెను; అయితే దావీదు స్థలము ఖాళిగా నుండెను.

1సమూయేలు 20:26 అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై యుండునేమో, అతడు అపవిత్రుడై యుండుట యవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమియు అనలేదు.

1సమూయేలు 20:27 అయితే అమావాస్య పోయిన మరునాడు, అనగా రెండవ దినమున దావీదు స్థలములో ఎవడును లేకపోవుట చూచి సౌలు నిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతాను నడుగగా

1సమూయేలు 20:28 యోనాతాను దావీదు బేత్లెహేమునకు పోవలెనని కోరి

1సమూయేలు 20:29 దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా యింటివారు బలి అర్పింపబోవుచున్నారు నీవును రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయపొందిన వాడనైతే నేను వెళ్లి నా సహోదరులను దర్శించునట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నాయొద్ద సెలవు తీసికొనెను; అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్లయొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా

1సమూయేలు 20:30 సౌలు యోనాతానుమీద బహుగా కోపపడి ఆగడగొట్టుదాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా?

1సమూయేలు 20:31 యెష్షయి కుమారుడు భూమిమీద బ్రదుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు గదా; కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమునకర్హుడని చెప్పెను.

1సమూయేలు 20:32 అంతట యోనాతాను అతడెందుకు మరణ శిక్ష నొందవలెను? అతడు ఏమి చేసెనని సౌలు నడుగగా

1సమూయేలు 20:33 సౌలు అతనిని పొడువవలెనని యీటె విసిరెను; అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము గలిగియున్నాడని యోనాతాను తెలిసికొని

1సమూయేలు 20:34 అత్యాగ్రహుడై బల్లయొద్దనుండి లేచి, తన తండ్రి దావీదును అవమానపరచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను.

1సమూయేలు 20:35 ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసికొనిన వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయెను.

1సమూయేలు 20:36 నీవు పరుగెత్తికొనిపోయి నేను వేయు బాణములను వెదకుమని ఆ పనివానితో అతడు చెప్పగా వాడు పరుగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను.

1సమూయేలు 20:37 అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుకనుండి కేక వేసి బాణము నీ అవతలనున్నదని చెప్పి

1సమూయేలు 20:38 వాని వెనుకనుండి కేకవేసి నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను; యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానుని యొద్దకు వాటిని తీసికొనివచ్చెను గాని

1సమూయేలు 20:39 సంగతి ఏమియు వానికి తెలియక యుండెను. యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసియుండెను.

1సమూయేలు 20:40 యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసికొనిపొమ్మని చెప్పి వాని పంపివేసెను.

1సమూయేలు 20:41 వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కునుండి బయటికి వచ్చి మూడు మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దుపెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను.

1సమూయేలు 20:42 అంతట యోనాతాను యెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమునుబట్టి ప్రమాణము చేసికొని యున్నాము గనుక మనస్సులో నెమ్మది గలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్లిపోయెను; యోనాతానును పట్టణమునకు తిరిగివచ్చెను.

యెషయా 1:14 మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలములును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.

యెషయా 1:15 మీరు మీచేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీచేతులు రక్తముతో నిండియున్నవి.

యోహాను 18:28 వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు.

1కొరిందీయులకు 5:8 గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.

కీర్తనలు 37:12 భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు.

యోబు 16:9 ఆయన తన కోపముచేత నామీద పడి నన్ను చీల్చెను. ఆయన నామీద పండ్లు కొరుకుచుండెను నాకు శత్రువై నామీద తన కన్నులు ఎఱ్ఱచేసెను.

విలాపవాక్యములు 2:16 నీ శత్రువులందరు నిన్నుచూచి నోరుతెరచెదరు వారు ఎగతాళిచేసి పండ్లుకొరుకుచు దాని మింగివేసియున్నాము ఇదేగదా మనము కనిపెట్టిన దినము అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని యనుకొనెదరు.

అపోస్తలులకార్యములు 7:54 వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి.

న్యాయాధిపతులు 16:23 ఫిలిష్తీయుల సర్దారులుమన దేవత మన శత్రువైన సమ్సోనును మనచేతికి అప్పగించియున్నదని చెప్పుకొని, తమ దేవతయైన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడు కొనిరి.

న్యాయాధిపతులు 16:25 వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారుమనము పరిహాసము చేయుటకు సమ్సోనును పిలిపించుదము రండని సమ్సోనును బందీ గృహమునుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువ బెట్టి పరిహాసముచేయగా

2దినవృత్తాంతములు 36:16 పెందలకడ లేచి పంపుచువచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనులమీదికి వచ్చెను.

నెహెమ్యా 4:1 మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళిచేసి

యోబు 11:3 నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండవలెనా? ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యము చేయుదువా?

యోబు 12:4 నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.

యోబు 30:1 ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సుగలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగనివారని నేను తలంచియుంటిని.

యోబు 30:9 అట్టివారు ఇప్పుడు నన్నుగూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను.

కీర్తనలు 22:7 నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు.

కీర్తనలు 69:12 గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాటలాడుకొందురు త్రాగుబోతులు నన్నుగూర్చి పాటలు పాడుదురు.

కీర్తనలు 109:25 వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు

యిర్మియా 20:7 యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని; నీవు బలవంతముచేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్ల నవ్వులపాలైతిని, అందరు నన్ను ఎగతాళి చేయుదురు.

విలాపవాక్యములు 3:14 నావారికందరికి నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడనైతిని.

యెహెజ్కేలు 36:3 వచనమెత్తి ఈలాగు ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లుగాను, నిందించువారిచేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగునట్లుగాను, నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మను పట్టుకొన నాశించి మిమ్మును పాడుచేసియున్నారు.

మీకా 7:8 నా శత్రువా, నామీద అతిశయింపవద్దు, నేను క్రిందపడినను, తిరిగిలేతును; నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును.

మత్తయి 20:19 ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును.

మత్తయి 27:29 ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడిచేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి

లూకా 16:14 ధనాపేక్షగల పరిసయ్యులు ఈ మాటలన్నియు విని ఆయనను అపహసించుచుండగా

లూకా 22:63 వెలుపలికిపోయి సంతాపపడి యేడ్చెను.