Logo

కీర్తనలు అధ్యాయము 41 వచనము 9

కీర్తనలు 55:12 నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చును నామీద మిట్టిపడువాడు నాయందు పగపట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును.

కీర్తనలు 55:13 ఈ పనిచేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు.

కీర్తనలు 55:14 మనము కూడి మధురమైన గోష్ఠిచేసి యున్నవారము ఉత్సవమునకు వెళ్లు సమూహముతో దేవుని మందిరమునకు పోయి యున్నవారము.

కీర్తనలు 55:20 తమతో సమాధానముగా నున్నవారికి వారు బలాత్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు.

కీర్తనలు 55:21 వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే.

కీర్తనలు 55:22 నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.

2సమూయేలు 15:12 మరియు బలి అర్పింపవలెననియుండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపెలు అను దావీదుయొక్క మంత్రిని గీలో అను అతని ఊరినుండి పిలిపించి యుండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి మరి యెక్కువగుటచేత కుట్ర బహు బలమాయెను.

యోబు 19:19 నా ప్రాణస్నేహితులకందరికి నేనసహ్యుడనైతిని నేను ప్రేమించినవారు నా మీద తిరుగబడియున్నారు.

యిర్మియా 20:10 నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించినయెడల మేమును చాటింతుమందురు; అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతనిమీద పగతీర్చుకొందమని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరు నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకొనియున్నారు.

ద్వితియోపదేశాకాండము 32:15 యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణశైలమును తృణీకరించెను.

ఓబధ్యా 1:7 నీతో సంధిచేసినవారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు; నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు; వారు నీ యన్నము తిని నీకొరకు ఉరి యొడ్డుదురు; ఎదోమునకు వివేచన లేకపోయెను.

యోహాను 13:18 మిమ్మునందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదును గాని నాతో కూడ భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను అను లేఖనము నెరవేరుటకై యీలాగు జరుగును.

యోహాను 13:26 అందుకు యేసు నేనొక ముక్క ముంచి యెవనికిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను;

యోహాను 13:27 వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా

2సమూయేలు 9:7 అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును; మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనము చేయుదువని సెలవియ్యగా

2సమూయేలు 15:31 అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను.

యోబు 6:15 నా స్నేహితులు ఎండిన వాగువలెను మాయమైపోవు జలప్రవాహములవలెను నమ్మకూడని వారైరి.

కీర్తనలు 31:11 నా శత్రువులకందరికి నేను నిందాస్పదుడనై యున్నాను నా పొరుగువారికి విచారకారణముగా ఉన్నాను నా నెళవరులకు భీకరుడనై యున్నాను వీధిలో నన్ను చూచువారు నాయెదుటనుండి పారిపోవుదురు.

యిర్మియా 38:22 యూదా రాజు నగరులో శేషించియున్న స్త్రీలందరు బబులోను అధిపతులయొద్దకు కొనిపోబడెదరు, ఆలాగు జరుగగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియస్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైని విజయము పొందియున్నారు, నీ పాదములు బురదలో దిగబడియుండగా వారు వెనుకతీసిరని యందురు.

యిర్మియా 41:1 ఏడవ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజుయొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలనువాడును, అతనితో పదిమంది మనుష్యులును, మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వచ్చి అక్కడ అతనితోకూడ మిస్పాలో భోజనము చేసిరి.

దానియేలు 11:26 ఏమనగా, అతని భోజనమును భుజించువారు అతని పాడు చేసెదరు; మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు హతులవుదురు.

మీకా 7:6 కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు, ఎవరి ఇంటివారు వారికే విరోధులగుదురు.

మత్తయి 10:36 ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.

మత్తయి 26:23 ఆయన నాతోకూడ పాత్రలో చెయ్యి ముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించువాడు.

మత్తయి 26:50 యేసు చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీద పడి ఆయనను పట్టుకొనిరి.

మార్కు 14:10 పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకుల చేతికి ఆయనను అప్పగింపవలెనని వారియొద్దకు పోగా

మార్కు 14:18 వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా

లూకా 12:52 ఇప్పుటినుండి ఒక ఇంటిలో అయిదుగురు వేరుపడి, ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా యిద్దరును ఉందురు.

లూకా 22:3 అంతట పండ్రెండుమంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను

లూకా 22:21 ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడ ఈ బల్లమీద ఉన్నది.

యోహాను 6:71 సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండుమందిలో ఒకడైయుండి ఆయననప్పగింపబోవుచుండెను గనుక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.

అపోస్తలులకార్యములు 1:16 సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను.

1యోహాను 2:19 వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడునట్లు వారు బయలువెళ్లిరి.