Logo

కీర్తనలు అధ్యాయము 45 వచనము 14

పరమగీతము 1:4 నన్ను ఆకర్షించుము మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్నుబట్టి మేము సంతోషించి ఉత్సహించెదము ద్రాక్షారసముకన్న నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు.

యోహాను 17:24 తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించినవారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి.

2కొరిందీయులకు 11:2 దేవాసక్తితో మీయెడల ఆసక్తి కలిగియున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని గాని,

నిర్గమకాండము 28:39 మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టాపనిగా చేయవలెను. సన్ననారతో పాగాను నేయవలెను; దట్టిని బుట్టాపనిగా చేయవలెను.

న్యాయాధిపతులు 5:30 వారికి దొరకెను గదా? దోపుడుసొమ్ము పంచుకొను చున్నారు గదా? యోధులందరు తలాయొక స్త్రీని తీసికొందురు ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు సీసెరాకు రంగువేయబడిన వస్త్రమొకటి దోపుడు సొమ్ముగా దొరకును రంగువేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడుగా దొరకును రెండువైపుల రంగువేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనినవారి మెడలకు తగిన వస్త్రమొకటి దొరకును.

పరమగీతము 1:3 నీవు పూసికొను పరిమళతైలము సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు.

పరమగీతము 1:5 యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను

పరమగీతము 2:7 యెరూషలేము కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

పరమగీతము 5:8 యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడినయెడల ప్రేమాతిశయముచేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీచేత ప్రమాణము చేయించుకొందును.

పరమగీతము 5:9 స్త్రీలలో అధిక సుందరివగుదానా, వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి? నీవు మాచేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి?

పరమగీతము 6:1 స్త్రీలలో అధిక సుందరివగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడేదిక్కునకు తిరిగెను?

పరమగీతము 6:8 అరువదిమంది రాణులును ఎనుబదిమంది ఉపపత్నులును లెక్కకు మించిన కన్యకలును కలరు.

పరమగీతము 6:13 షూలమ్మితీ, రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. షూలమ్మితీయందు మీకు ముచ్చట పుట్టించునదేది? అమె మహనయీము నాటకమంత వింతయైనదా?

పరమగీతము 8:13 ఉద్యానవనములలో పెంచబడినదానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు నన్నును దాని విననిమ్ము.

ప్రకటన 14:1 మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి.

ప్రకటన 14:2 మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.

ప్రకటన 14:3 వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దల యెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగు వేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.

ప్రకటన 14:4 వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవుని కొరకును గొఱ్ఱపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.

ఆదికాండము 24:47 అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని యడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నేనామె ముక్కుకు కమ్మియును ఆమెచేతులకు కడియములను పెట్టి

ఆదికాండము 37:3 మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువుటంగీ కుట్టించెను.

నిర్గమకాండము 27:16 ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెర యుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను; వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు.

2సమూయేలు 13:18 కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములుగల చీరలు ధరించువారు ఆమె యట్టి చీరయొకటి ధరించియుండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్లగొట్టి మరల రాకుండునట్లు తలుపు గడియవేసెను.

సామెతలు 31:22 ఆమె పరుపులను సిద్ధపరచుకొనును ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు.

యెషయా 61:10 శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తె రీతిగాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసియున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది

యిర్మియా 2:32 కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లికుమారి తన ఒడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు.

యెహెజ్కేలు 16:10 విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపజేసితిని, సన్నమైన యెఱ్ఱని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని, సన్నపు అవిసెనారబట్ట నీకు వేయించితిని, నీకు పట్టుబట్ట ధరింపజేసితిని.

యెహెజ్కేలు 16:13 ఈలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి, సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియుగల బట్టలును నీకు ధరింపజేసి, గోధుమలును తేనెయు నూనెయు నీకాహారముగా ఇయ్యగా, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృధ్ధి నొందితివి.

మత్తయి 9:15 యేసు పెండ్లికుమారుడు తమతోకూడ నుండు కాలమున పెండ్లియింటివారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు.

మత్తయి 22:11 రాజు కూర్చున్నవారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి

మత్తయి 25:1 పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది.

మార్కు 2:19 యేసు పెండ్లికుమారుడు తమతోకూడ ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా? పెండ్లికుమారుడు తమతోకూడ ఉన్నంతకాలము ఉపవాసము చేయదగదు గాని

లూకా 5:34 అందుకు యేసు పెండ్లికుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటివారిచేత మీరు ఉపవాసము చేయింపగలరా?

యోహాను 3:29 పెండ్లికుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు; అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును; ఈ నా సంతోషము పరిపూర్ణమైయున్నది.

1తిమోతి 2:9 మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రములచేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,

ప్రకటన 14:4 వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవుని కొరకును గొఱ్ఱపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు.

ప్రకటన 19:8 మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములు నైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.