Logo

కీర్తనలు అధ్యాయము 54 వచనము 2

కీర్తనలు 5:1 యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము.

కీర్తనలు 5:2 నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను.

కీర్తనలు 5:3 యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.

కీర్తనలు 13:3 యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము

కీర్తనలు 55:1 దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము.

కీర్తనలు 55:2 నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము.

కీర్తనలు 130:2 ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము.

కీర్తనలు 143:7 యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము