Logo

కీర్తనలు అధ్యాయము 66 వచనము 17

కీర్తనలు 30:8 యెహోవా, నీకే మొఱ్ఱపెట్టితిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగినయెడల నా ప్రాణమువలన ఏమి లాభము?

కీర్తనలు 34:3 నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము.

కీర్తనలు 34:4 నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను.

కీర్తనలు 34:6 ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను.

కీర్తనలు 116:1 యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను.

కీర్తనలు 116:2 ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱపెట్టుదును

కీర్తనలు 116:12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?

కీర్తనలు 30:1 యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనియ్యక నీవు నన్నుద్ధరించియున్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను.

కీర్తనలు 145:1 రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను

యోబు 22:27 నీవు ఆయనకు ప్రార్థనచేయగా ఆయన నీ మనవి నాలకించును నీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు.

కీర్తనలు 3:4 ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతమునుండి నాకుత్తరమిచ్చును.

కీర్తనలు 63:3 నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును.