Logo

కీర్తనలు అధ్యాయము 71 వచనము 17

కీర్తనలు 71:5 నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే బాల్యమునుండి నా ఆశ్రయము నీవే.

కీర్తనలు 119:9 (బేత్‌) యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?

కీర్తనలు 119:102 నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధులనుండి నేను తొలగకయున్నాను.

కీర్తనలు 66:16 దేవునియందు భయభక్తులు గలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను.

1సమూయేలు 17:36 మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానివలె అగుననియు,

1సమూయేలు 17:37 సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండి కూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు పొమ్ము; యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను.

2సమూయేలు 4:9 దావీదు బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోను బయనాతోను ఇట్లనెను

2సమూయేలు 22:1 యెహోవా తన్ను సౌలు చేతిలోనుండియు, తన శత్రువులందరి చేతిలోనుండియు తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను.

2సమూయేలు 22:2 యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు.

2సమూయేలు 22:3 నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము నా రక్షణశృంగము నా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు బలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే.

2సమూయేలు 22:4 కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టితిని నా శత్రువుల చేతిలోనుండి ఆయన నన్ను రక్షించెను.

2సమూయేలు 22:5 మృత్యువుయొక్క అలలు నన్ను చుట్టుకొనగను వరదపొర్లువలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదరించగను

2సమూయేలు 22:6 పాతాళ పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరించగను

2సమూయేలు 22:7 నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవుని ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొఱ్ఱ ఆయన చెవులలో చొచ్చెను.

2సమూయేలు 22:8 అప్పుడు భూమి కంపించి అదిరెను పరమండలపు పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను.

2సమూయేలు 22:9 ఆయన నాసికారంధ్రములలోనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను నిప్పు కణములను రాజబెట్టెను.

2సమూయేలు 22:10 మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను.

2సమూయేలు 22:11 కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను.గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.

2సమూయేలు 22:12 గుడారమువలె అంధకారము తనచుట్టు వ్యాపింపజేసెను. నీటిమబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను.

2సమూయేలు 22:13 ఆయన సన్నిధికాంతిలోనుండి నిప్పుకణములు పుట్టెను.

2సమూయేలు 22:14 యెహోవా ఆకాశమందు గర్జించెను సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను.

2సమూయేలు 22:15 తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగుభాగములు కనబడెను

2సమూయేలు 22:16 భూమి పునాదులు బయలుపడెను.

2సమూయేలు 22:17 ఉన్నతస్థలములనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను.

2సమూయేలు 22:18 బలవంతులగు పగవారు, నన్ను ద్వేషించువారు, నాకంటె బలిష్ఠులైయుండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను.

2సమూయేలు 22:19 ఆపత్కాలమందు వారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను.

2సమూయేలు 22:20 నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను.

2సమూయేలు 22:21 నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమునుబట్టియే నాకు ప్రతిఫలమిచ్చెను.

2సమూయేలు 22:22 యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడచినవాడను కాను.

2సమూయేలు 22:23 ఆయన న్యాయవిధులనన్నిటిని నేను లక్ష్యపెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడనుకాను.

2సమూయేలు 22:24 దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని.

2సమూయేలు 22:25 కావున నేను నిర్దోషినైయుండుట యెహోవా చూచెను తన దృష్టికి కనబడిన నాచేతుల నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.

2సమూయేలు 22:26 దయగలవారి యెడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల యెడల నీవు యథార్థవంతుడవుగానుందువు.

2సమూయేలు 22:27 సద్భావముగలవారి యెడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు.

2సమూయేలు 22:28 శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు

2సమూయేలు 22:29 యెహోవా, నీవు నాకు దీపమైయున్నావు యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును.

2సమూయేలు 22:30 నీ సహాయముచేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయమువలన నేను ప్రాకారములను దాటుదును.

2సమూయేలు 22:31 దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము ఆయన శరణుజొచ్చువారికందరికి ఆయన కేడెము.

2సమూయేలు 22:32 యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?

2సమూయేలు 22:33 దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును.

2సమూయేలు 22:34 ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేయును ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపును.

2సమూయేలు 22:35 నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును.

2సమూయేలు 22:36 నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్పచేయును.

2సమూయేలు 22:37 నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు.

2సమూయేలు 22:38 నా శత్రువులను తరిమి నాశనము చేయుదును వారిని నశింపజేయువరకు నేను తిరుగను.

2సమూయేలు 22:39 నేను వారిని మింగివేయుదును వారిని తుత్తినియలుగా కొట్టుదును వారు నా పాదముల క్రింద పడి లేవలేకయుందురు.

2సమూయేలు 22:40 యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు నామీదికి లేచినవారిని నీవు అణచివేయుదువు.

2సమూయేలు 22:41 నా శత్రువులను వెనుకకు మళ్లచేయుదువు నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేయుదును.

2సమూయేలు 22:42 వారు ఎదురుచూతురు గాని రక్షించువాడు ఒకడును లేకపోవును వారు యెహోవా కొరకు కనిపెట్టుకొనినను ఆయన వారికి ప్రత్యుత్తరమియ్యకుండును.

2సమూయేలు 22:43 నేల ధూళివలె వారిని నలుగగొట్టెదను పొడిగా వారిని కొట్టెదను వీధిలోని పెంటవలె నేను వారిని పారపోసి అణగద్రొక్కెదను.

2సమూయేలు 22:44 నా ప్రజల కలహములలో పడకుండ నీవు నన్ను విడిపించితివి జనులకు అధికారిగా నన్ను నిలిపితివి నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు.

2సమూయేలు 22:45 అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు వారు నన్నుగూర్చి వినిన మాత్రముచేత నాకు విధేయులగుదురు

2సమూయేలు 22:46 అన్యులు దుర్బలులై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు.

2సమూయేలు 22:47 యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయదుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక

2సమూయేలు 22:48 ఆయన నా నిమిత్తము ప్రతిదండనచేయు దేవుడు ఆయన నా నిమిత్తము పగతీర్చు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే.

2సమూయేలు 22:49 ఆయనే నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపించును నామీదికి లేచినవారికంటె ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.

2సమూయేలు 22:50 అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామకీర్తన గానము చేసెదను.

2సమూయేలు 22:51 నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు.

1దినవృత్తాంతములు 16:4 మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను.

1దినవృత్తాంతములు 16:5 వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెమీయేలు షెమీరామోతు యెహీయేలు మత్తిత్యా ఏలీయాబు బెనాయా ఓబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి, ఆసాపు తాళములను వాయించువాడు.

1దినవృత్తాంతములు 16:6 బెనాయా యహజీయేలు అను యాజకులు ఎప్పుడును దేవుని నిబంధన మందసము ఎదుట బూరలు ఊదువారు.

1దినవృత్తాంతములు 16:7 ఆ దినమందు యెహోవాను స్తుతిచేయు విచారణను ఏర్పరచి, దావీదు ఆసాపుచేతికిని వాని బంధువులచేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా

1దినవృత్తాంతములు 16:8 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి.

1దినవృత్తాంతములు 16:9 ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన అద్భుత క్రియలన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి.

1దినవృత్తాంతములు 16:10 ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు గాక.

1దినవృత్తాంతములు 16:11 యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి.

1దినవృత్తాంతములు 16:12 ఆయన దాసులగు ఇశ్రాయేలు వంశస్థులారా ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతివారలారా

1దినవృత్తాంతములు 16:13 ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసికొనుడి ఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసికొనుడి.

1దినవృత్తాంతములు 16:14 ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి.

1దినవృత్తాంతములు 16:15 మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప సంఖ్యగల జనులుగాను కనాను దేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాని నీకిచ్చెదనని

1దినవృత్తాంతములు 16:16 ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను

1దినవృత్తాంతములు 16:17 ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి.

1దినవృత్తాంతములు 16:18 వేయితరములవరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను.

1దినవృత్తాంతములు 16:19 యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్యనిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచియున్నాడు.

1దినవృత్తాంతములు 16:20 వారు జనమునుండి జనమునకును రాజ్యమునుండి రాజ్యమునకును తిరుగులాడుచుండగా

1దినవృత్తాంతములు 16:21 నేను అభిషేకించినవారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి

1దినవృత్తాంతములు 16:22 ఆయన ఎవరినైనను వారికి హింస చేయనియ్యలేదు వారి నిమిత్తము రాజులను గద్దించెను.

1దినవృత్తాంతములు 16:23 సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి.

1దినవృత్తాంతములు 16:24 అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి.

1దినవృత్తాంతములు 16:25 యెహోవా మహా ఘనత వహించినవాడు ఆయన బహుగా స్తుతినొందతగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు.

1దినవృత్తాంతములు 16:26 జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు.

1దినవృత్తాంతములు 16:27 ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి.

1దినవృత్తాంతములు 16:28 జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి.

1దినవృత్తాంతములు 16:29 యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములుచేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి.

1దినవృత్తాంతములు 16:30 భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి అప్పుడు భూలోకము కదలకుండును అప్పుడది స్థిరపరచబడును.

1దినవృత్తాంతములు 16:31 యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక

1దినవృత్తాంతములు 16:32 సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక పొలములును వాటియందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు.

1దినవృత్తాంతములు 16:33 భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సయించును.

1దినవృత్తాంతములు 16:34 యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి.

1దినవృత్తాంతములు 16:35 దేవా మా రక్షకా, మమ్మును రక్షించుము మమ్మును చేర్చుకొనుము.

1దినవృత్తాంతములు 16:36 మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములోనుండి మమ్మును విడిపింపుము. అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరు ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించిరి.

నిర్గమకాండము 18:8 తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను.

1సమూయేలు 7:12 అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి యింతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు1 అను పేరు పెట్టెను.

1రాజులు 18:12 అయితే నేను నీయొద్దనుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును, అప్పుడు

1దినవృత్తాంతములు 16:9 ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన అద్భుత క్రియలన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి.

యోబు 6:10 అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండ లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనెంత వేదనపడుచుండినను దానిబట్టి హర్షించుదును

యోబు 27:11 దేవుని హస్తమునుగూర్చి నేను మీకు ఉపదేశించెదను సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను.

కీర్తనలు 21:1 యెహోవా, రాజు నీ బలమునుబట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణనుబట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు.

కీర్తనలు 22:9 గర్భమునుండి నన్ను తీసినవాడవు నీవే గదా నేను నా తల్లియొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి.

కీర్తనలు 26:7 అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్యకార్యములను వివరింతును.

కీర్తనలు 27:9 నీ ముఖమును నాకు దాచకుము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము నన్ను విడువకుము

కీర్తనలు 73:28 నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.

కీర్తనలు 107:31 ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్యకార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

కీర్తనలు 118:17 నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను.

కీర్తనలు 119:27 నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను.

కీర్తనలు 119:43 నా నోటనుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము నీ న్యాయవిధులమీద నా ఆశ నిలిపియున్నాను.

కీర్తనలు 119:171 నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును

కీర్తనలు 138:8 యెహోవా నా పక్షమున కార్యము సఫలముచేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును నీచేతి కార్యములను విడిచిపెట్టకుము.

కీర్తనలు 145:5 మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను

ప్రసంగి 12:1 దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే,

యెషయా 45:21 మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసినవాడెవడు? చాలకాలము క్రిందట దాని ప్రకటించినవాడెవడు? యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు

యెషయా 48:17 నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.

యెషయా 54:13 నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.

యిర్మియా 3:4 అయినను ఇప్పుడు నీవు నా తండ్రీ, చిన్నప్పటినుండి నాకు చెలికాడవు నీవేయని నాకు మొఱ్ఱపెట్టుచుండవా?

లూకా 2:17 వారు చూచి, యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి.

లూకా 8:38 అయితే ఆయన నీవు నీ యింటికి తిరిగివెళ్లి, దేవుడు నీకెట్టి గొప్పకార్యములు చేసెనో తెలియజేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను; వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్పకార్యములు చెసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను

యోహాను 17:6 లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై యుండిరి, నీవు వారిని నాకనుగ్రహించితివి; వారు నీ వాక్యము గైకొనియున్నారు.

అపోస్తలులకార్యములు 2:11 క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి.

అపోస్తలులకార్యములు 21:16 మరియు కైసరయనుండి కొందరు శిష్యులు, మొదటనుండి శిష్యుడుగా ఉండిన కుప్రీయుడైన మ్నాసోను ఇంట మేము దిగవలెనను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతో కూడ వచ్చిరి.

ఎఫెసీయులకు 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష యేదైనను మీనోట రానియ్యకుడి.

ఎఫెసీయులకు 6:4 తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.

ఫిలిప్పీయులకు 2:16 అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమునుచేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్‌ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయ కారణము కలదు

2తిమోతి 3:15 నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.