Logo

కీర్తనలు అధ్యాయము 73 వచనము 5

కీర్తనలు 17:14 లోకుల చేతిలోనుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ లోకుల చేతిలోనుండి నీ హస్తబలముచేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తినొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు.

యోబు 21:23 ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను తన యెముకలలో మూలుగ బలిసియుండగను

యోబు 21:24 సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతినొందును

యోబు 24:20 కన్నగర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయును వారు మరి ఎప్పుడును జ్ఞాపకములోనికి రారు వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు

ప్రసంగి 2:16 బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికిని యుంచబడదు; రాబోవు దినములలో వారందరును మరువబడినవారై యుందురు; జ్ఞానులు మృతినొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినొందు విధమట్టిదే.

ప్రసంగి 7:15 నా వ్యర్థసంచారముల కాలములో నేను వీటినన్నిటిని చూచితిని; నీతి ననుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులై యుండియు చిరాయువులైన దుష్టులును కలరు.

లూకా 16:22 ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.

కీర్తనలు 17:10 వారు తమ హృదయమును కఠినపరచుకొనియున్నారు వారి నోరు గర్వముగా మాటలాడును.

యోబు 21:13 వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురు ఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు.

యిర్మియా 48:11 మోయాబు తన బాల్యమునుండి నెమ్మదినొందెను ఈ కుండలోనుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండ అది మడ్డిమీద నిలిచెను అదెన్నడును చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది దాని వాసన ఎప్పటివలెనే నిలుచుచున్నది.