Logo

కీర్తనలు అధ్యాయము 88 వచనము 3

కీర్తనలు 79:11 చెరలోనున్నవాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాతిశయమును చూపుము చావునకు విధింపబడినవారిని కాపాడుము.

కీర్తనలు 141:1 యెహోవా నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నాయొద్దకు త్వరపడి రమ్ము నేను మొఱ్ఱపెట్టగా నా మాటకు చెవియొగ్గుము

కీర్తనలు 141:2 నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.

1రాజులు 8:31 ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతనిచేత ప్రమాణము చేయించుటకు అతనిమీద ఒట్టు పెట్టబడినయెడల, అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠము ఎదుట ఆ ఒట్టు పెట్టునప్పుడు

విలాపవాక్యములు 3:8 నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొనియున్నాడు.

1రాజులు 8:28 అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి, యీ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము.

కీర్తనలు 102:2 నా కష్టదినమున నాకు విముఖుడవై యుండకుము నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు త్వరపడి నాకుత్తరమిమ్ము.

మత్తయి 26:42 మరల రెండవమారు వెళ్లి నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగిపోవుట సాధ్యము కానియెడల, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి