Logo

కీర్తనలు అధ్యాయము 101 వచనము 8

2సమూయేలు 4:10 మంచి వర్తమానము తెచ్చితినని తలంచి యొకడు వచ్చి సౌలు చచ్చెనని నాకు తెలియజెప్పగా

2సమూయేలు 4:11 వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగులో నేను వానిని పట్టుకొని చంపించితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో చొరబడి, అతని మంచము మీదనే నిర్దోషియగువానిని చంపినప్పుడు మీచేత అతని ప్రాణదోషము విచారింపక పోవుదునా? లోకములో ఉండకుండ నేను మిమ్మును తీసివేయక మానుదునా?

2సమూయేలు 4:12 సకలమైన ఉపద్రవములలోనుండి నన్ను రక్షించిన యెహోవా జీవముతోడు మాననని చెప్పి, దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను చంపి వారిచేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలనుదగ్గర వ్రేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసికొనిపోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి.

2రాజులు 5:26 అంతట ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతోకూడ రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవచెట్ల తోటలను ద్రాక్షతోటలను గొఱ్ఱలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా?

2రాజులు 5:27 కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుటనుండి బయటికి వెళ్లెను.

సామెతలు 29:12 అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్థులందరు దుష్టులుగా నుందురు

అపోస్తలులకార్యములు 1:16 సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను.

అపోస్తలులకార్యములు 1:17 అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను.

అపోస్తలులకార్యములు 1:18 ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకలనిచ్చి యొక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను.

అపోస్తలులకార్యములు 1:19 ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా

అపోస్తలులకార్యములు 1:20 అతని యిల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడును కాపురముండక పోవునుగాక అతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది.

అపోస్తలులకార్యములు 1:25 తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి.

అపోస్తలులకార్యములు 5:1 అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను.

అపోస్తలులకార్యములు 5:2 భార్య యెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.

అపోస్తలులకార్యములు 5:3 అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను.?

అపోస్తలులకార్యములు 5:4 అది నీయొద్ద నున్నపుడు నీదేగదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను

అపోస్తలులకార్యములు 5:5 అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను;

అపోస్తలులకార్యములు 5:6 అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి.

అపోస్తలులకార్యములు 5:7 ఇంచుమించు మూడుగంటల సేపటికి వాని భార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను.

అపోస్తలులకార్యములు 5:8 అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను.

అపోస్తలులకార్యములు 5:9 అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొనిపోవుదురని ఆమెతో చెప్పెను

అపోస్తలులకార్యములు 5:10 వెంటనే ఆమె అతని పాదములయొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి.

లేవీయకాండము 14:40 యాజకుని సెలవుచొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమున పారవేయవలెను.

లేవీయకాండము 19:11 నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు;

కీర్తనలు 5:4 నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు

కీర్తనలు 119:163 అబద్ధము నాకసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.

సామెతలు 25:5 రాజు ఎదుటనుండి దుష్టులను తొలగించినయెడల అతని సింహాసనము నీతివలన స్థిరపరచబడును.

యెహెజ్కేలు 13:9 వ్యర్థమైన దర్శనములు కనుచు, నమ్మదగని సోదెగాండ్రయిన ప్రవక్తలకు నేను పగవాడను, వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరినవారు కాకపోదురు, వారు ఇశ్రాయేలీయుల దేశములోనికి తిరిగిరారు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలిసికొందురు.