Logo

కీర్తనలు అధ్యాయము 105 వచనము 41

కీర్తనలు 78:18 వారు తమ ఆశకొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి.

కీర్తనలు 78:26 ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలముచేత దక్షిణపు గాలి రప్పించెను.

కీర్తనలు 78:27 ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలుగల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను.

కీర్తనలు 78:28 వారి దండు మధ్యను వారి నివాసస్థలములచుట్టును ఆయన వాటిని వ్రాలజేసెను.

నిర్గమకాండము 16:12 నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను.

నిర్గమకాండము 16:13 కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచువారి పాళెము చుట్టు పడియుండెను.

సంఖ్యాకాండము 11:4 వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు?

సంఖ్యాకాండము 11:5 ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్లగడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.

సంఖ్యాకాండము 11:6 ఈ మన్నా కాక మా కన్నులయెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి.

సంఖ్యాకాండము 11:31 తరువాత యెహోవా సన్నిధినుండి ఒక గాలి బయలుదేరి సముద్రమునుండి పూరేళ్లను రప్పించి పాళెముచుట్టు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దినప్రయాణమంత దూరమువరకు భూమిమీద రెండు మూరల యెత్తున వాటిని పడజేసెను.

సంఖ్యాకాండము 11:32 కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రిఅంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి; తక్కువ కూర్చుకొనినవాడు నూరు తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమకొరకు పాళెము చుట్టు వాటిని పరచిరి.

సంఖ్యాకాండము 11:33 ఆ మాంసము ఇంక వారి పండ్లసందున నుండగానే, అది నమలకమునుపే, యెహోవా కోపము జనులమీద రగులుకొనెను; యెహోవా తెగులుచేత వారిని బహుగా బాధించెను.

నిర్గమకాండము 16:14 పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగు మంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను.

నిర్గమకాండము 16:15 ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.

నిర్గమకాండము 16:16 మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారికొరకు కూర్చుకొనవలెననెను.

నిర్గమకాండము 16:17 ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి.

నిర్గమకాండము 16:18 వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువకాలేదు. వారు తమ తమ యింటివారి భోజనమునకు సరిగా కూర్చుకొనియుండిరి.

నిర్గమకాండము 16:19 మరియు మోషే దీనిలో ఏమియు ఉదయమువరకు ఎవరును మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను.

నిర్గమకాండము 16:20 అయితే వారు మోషే మాటవినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపు కొట్టెను. మోషే వారిమీద కోపపడగా

నిర్గమకాండము 16:21 వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన యింటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను.

నిర్గమకాండము 16:22 ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజము యొక్క అధికారులందరు వచ్చి అది మోషేకు తెలిపిరి.

నిర్గమకాండము 16:23 అందుకు అతడు యెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయము వరకు మిగిలినదంతయు మీకొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను

నిర్గమకాండము 16:24 మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనిరి, అది కంపుకొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు.

నిర్గమకాండము 16:25 మోషే నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతిదినము, నేడు అది బయట దొరకదు.

నిర్గమకాండము 16:26 ఆరు దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతిదినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను.

నిర్గమకాండము 16:27 అట్లు జరిగెను; ప్రజలలో కొందరు ఏడవ దినమున దాని కూర్చుకొన వెళ్లగా వారికేమియు దొరకకపోయెను.

నిర్గమకాండము 16:28 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను మీరు ఎన్నాళ్లవరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు?

నిర్గమకాండము 16:29 చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీకనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచియుండవలెను. ఏడవ దినమున ఎవడును తన చోటనుండి బయలువెళ్లకూడదనెను.

నిర్గమకాండము 16:30 కాబట్టి యేడవ దినమున ప్రజలు విశ్రమించిరి.

నిర్గమకాండము 16:31 ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొతిమెర గింజవలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలె నుండెను.

నిర్గమకాండము 16:32 మరియు మోషే ఇట్లనెను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా నేను ఐగుప్తు దేశమునుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు, వారు తమయొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను.

నిర్గమకాండము 16:33 కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమయొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను.

నిర్గమకాండము 16:34 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను.

నిర్గమకాండము 16:35 ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలుబది యేండ్లు మన్నానే తినుచుండిరి; వారు కనాను దేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి.

సంఖ్యాకాండము 11:7 ఆ మన్నా కొతిమెరగింజలవలె ఉండెను. చూపునకు అది బోళమువలె ఉండెను.

సంఖ్యాకాండము 11:8 జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనముమీద కాల్చి రొట్టెలు చేసిరి; దాని రుచి క్రొత్త నూనె రుచివలె ఉండెను.

సంఖ్యాకాండము 11:9 రాత్రియందు మంచు పాళెముమీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను.

ద్వితియోపదేశాకాండము 8:3 ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను.

యెహోషువ 5:12 మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను; అటుతరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనానుదేశపు పంటను తినిరి.

నెహెమ్యా 9:20 వారికి భోధించుటకు నీ యుపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు; వారి దాహమునకు ఉదకమిచ్చితివి.

కీర్తనలు 78:23 అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. అంతరిక్ష ద్వారములను తెరచెను

కీర్తనలు 78:24 ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను ఆకాశధాన్యము వారికనుగ్రహించెను.

కీర్తనలు 78:25 దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను.

యోహాను 6:31 భుజించుటకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి.

యోహాను 6:32 కాబట్టి యేసు పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు.

యోహాను 6:33 పరలోకమునుండి దిగివచ్చి, లోకమునకు జీవమునిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమైయున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.

యోహాను 6:48 విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే.

యోహాను 6:49 మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.

యోహాను 6:50 దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమిదే.

యోహాను 6:51 పరలోకమునుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

యోహాను 6:52 యూదులు ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.

యోహాను 6:53 కావున యేసు ఇట్లనెను మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు.

యోహాను 6:54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

యోహాను 6:55 నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునైయున్నది.

యోహాను 6:56 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.

యోహాను 6:57 జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.

యోహాను 6:58 ఇదే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు గాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను

నిర్గమకాండము 16:4 యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశమునుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను.

సంఖ్యాకాండము 11:9 రాత్రియందు మంచు పాళెముమీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను.

నెహెమ్యా 9:15 వారి ఆకలి తీర్చుటకు ఆకాశమునుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలోనుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారి కాజ్ఞాపించితివి.

కీర్తనలు 78:24 ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను ఆకాశధాన్యము వారికనుగ్రహించెను.

హోషేయ 11:4 ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి అకర్షించితిని; ఒకడు పశువులమీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి యెదుట భోజనము పెట్టితిని

1కొరిందీయులకు 10:3 అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి;