Logo

కీర్తనలు అధ్యాయము 108 వచనము 3

కీర్తనలు 33:2 సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి

కీర్తనలు 69:30 కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను

కీర్తనలు 81:2 కీర్తన యెత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి.

కీర్తనలు 92:1 యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా,

కీర్తనలు 92:2 నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను

కీర్తనలు 92:3 పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది.

కీర్తనలు 92:4 ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీచేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను.

న్యాయాధిపతులు 5:12 దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము బారాకూ, కీర్తన పాడుము అబీనోయము కుమారుడా, లెమ్ము చెరపట్టిన వారిని చెరపట్టుము.

కీర్తనలు 57:8 నా ప్రాణమా, మేలుకొనుము స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను.

కీర్తనలు 103:22 యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వ కార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము.

కీర్తనలు 57:7 నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను.

కీర్తనలు 144:9 దేవా, నిన్నుగూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను పదితంతుల సితారాతో నిన్ను కీర్తించెదను.

కీర్తనలు 150:3 బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.