Logo

కీర్తనలు అధ్యాయము 113 వచనము 6

కీర్తనలు 89:6 మింటను యెహోవాకు సాటియైనవాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు?

కీర్తనలు 89:8 యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు.

నిర్గమకాండము 15:11 యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు

ద్వితియోపదేశాకాండము 33:26 యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును.

యెషయా 40:18 కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు?

యెషయా 40:25 నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.

యెషయా 16:5 కృపవలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పుతీర్చు నొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును.

యిర్మియా 10:6 యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహాత్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘనమైనదాయెను.

1రాజులు 8:23 యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమియందైనను నీవంటి దేవుడొకడునులేడు; పూర్ణమనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై యున్నావు,

1రాజులు 8:30 మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్ల, నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము; వినునప్పుడెల్ల మమ్మును క్షమించుము.

2దినవృత్తాంతములు 6:18 మనుష్యులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే; నేను కట్టిన యీ మందిరము నిన్ను పట్టునా?

యోబు 16:19 ఇప్పుడు నాకు సాక్షియైనవాడు పరలోకములోనున్నాడు నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు.

యోబు 21:22 ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా? పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా.

కీర్తనలు 7:7 జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనునప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము.

కీర్తనలు 21:13 యెహోవా, నీ బలమునుబట్టి నిన్ను హెచ్చించుకొనుము మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము.

కీర్తనలు 123:1 ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను.

కీర్తనలు 138:6 యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.

యెషయా 6:1 రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.

యెషయా 12:4 యెహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి.

యెషయా 33:5 యెహోవా మహా ఘనత నొందియున్నాడు ఆయన ఉన్నతస్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను.

యెషయా 46:5 మేము సమానులమని నన్ను ఎవనికి సాటిచేయుదురు? మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయుదురు?

యెషయా 63:15 పరమునుండి చూడుము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాసస్థలమునుండి దృష్టించుము నీ ఆసక్తి యేది? నీ శౌర్యకార్యములేవి? నాయెడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణగిపోయెనే.

యిర్మియా 23:23 నేను సమీపముననుండు దేవుడను మాత్ర మేనా? దూరముననుండు దేవుడను కానా?

యిర్మియా 49:19 చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహమువలె వచ్చుచున్నారు, నిమిషములోనే నేను వారిని దానియొద్దనుండి తోలివేయుదును, నేనెవని నేర్పరతునో వానిని దానిమీద నియమించెదను; నన్ను పోలియున్నవాడై నాకు ఆక్షేపణ కలుగచేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరియేడి?

దానియేలు 2:11 రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు; దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవుగదా.

మీకా 7:18 తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు.

లూకా 12:6 అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు.